English   

నయనతార కుమ్మేసిందంతే... 

nayantara
2018-07-27 10:08:23

లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ మూవీ కొలమావు కోకిల. ఈ సినిమాను తెలుగులో కోకో కోకిల గా విడుదల చేస్తున్నారు. లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. సింప్లీ సూపర్బ్. ఆల్రెడీ ఈ ట్రైలర్ కోలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు తెలుగులోనూ ఓ రేంజ్ లో ఉంటుందనే చెప్పాలి. ఇక తనే సెంటర్ పాయింట్ గా ఉండేలా కథలు ఒప్పుకుంటోన్న నయన్ మరోసారి ఓ వైవిధ్యమైన కథతో ఈ సినిమా చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. 

పాత సినిమాల్లో హీరోలాగా ఇంటినిండా కష్టాలున్న అమ్మాయి పాత్రలో నయన్ కనిపిస్తోంది. తన ఇంట్లో అందరికీ సమస్యలే. ఆ సమస్యలు తీర్చడం కోసం అత్యంత సమస్యాత్మకమైన డ్రగ్స్ ను అమ్మడం ప్రారంభిస్తుంది. కానీ ఈ క్రమంలో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. 25కోట్ల వాల్యూ చేసే డ్రగ్ తో తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లే ప్రయత్నంలో కోకిల ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటీ అనేదే కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. కానీ సినిమా చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ ముందు నుంచీ చెబుతున్నాడు. ఇక నయనతారే ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ కోకో కోకిల తెలుగు ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. 

ఇక నయన్ ను లవ్ చేసే పాత్రలో కమెడియన్ యోగిబాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఓ డ్యూయొట్ కూడా ఉంటుంది. అయితే ముందు నుంచీ ఈ సినిమాకు హైలెట్ గా అనిరుధ్ మ్యూజిక్ నే చెబుతున్నారు. అలా ఎందుకు చెబుతున్నారో ఈ ట్రైలర్ లో వస్తోన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే చాలు. ఇక సినిమాను తెలుగులో ఆగస్ట్ 17న విడుదల చేస్తున్నట్టు ట్రైలర్ లోనే చెప్పేశారు. మరి ఈ కోకిల బాక్సాఫీస్ వద్ద ఎలా కూస్తుందో చూడాలి. 

More Related Stories