English   

నయనతార ఇంటినిండా డ్రగ్సే..?

nayanathara-drugs

నయనతార.. ఇప్పుడు సౌత్ ల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఒకప్పుడు దర్శకుల డిమాండ్ మేరకు ఎంత ఎక్స్ పోజింగ్ అయినా చేసిన నయన్.. ఇప్పుడు తానే దర్శక, నిర్మాతలతో పాటు హీరోలకూ కండీషన్స్ పెట్టే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతోన్న నయన్ ను ఇప్పుడంతా లేడీ సూపర్ స్టార్ అనేస్తున్నారు. విజయశాంతి తర్వాత కోలీవుడ్ లో ఆ పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార కావడం విశేషం. రీసెంట్ గా ఆరమ్ సినిమాలో కలెక్టర్ గా నయన చూపిన నటనకు ఫిదా కానివారు లేరు. ఈ సినిమా తెలుగులోనూ కర్తవ్యంగా వచ్చింది. ఇక దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లికి రెడీ అయిన నయన్ కు సంబంధించి లేటెస్ట్ గా ఓ సెన్షేషనల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. నయన్ ఇంటినిండా డ్రగ్స్ ఉన్నాయనేదే ఆ వార్త సారాంశం. 

నయనతార డ్రమ్స్ అమ్ముతోంది. ఇదీ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిన విషయం. తనెందుకు డ్రమ్స్ అమ్ముతోంది. అలా అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. అనేదే అసలు కథ అంటున్నారు. కథేంటీ అనుకుంటున్నారా.. అవును మరి.. నయనతార లేటెస్ట్ మూవీలో తను చేస్తోన్న పాత్ర ఇదే. అంటే ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందన్నమాట. ఆ సినిమా పేరు కొలమావు కోవెల. ఈ కొలమావు కోవెల సినిమాలో నయన్ డ్రగ్స్ అమ్మే అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో మరింత క్రేజ్ వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు నయనతార డేట్స్ కోసం ఎంతోమంది ప్రొడ్యూసర్స్ బ్లాంక్ చెక్స్ తో రెడీగా ఉన్నారు. అందుకు కారణం ఏంటో తెలుసా.. నయన్ చేసిన ప్రతి సినమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అసలు ఏ మాత్రం ఎక్స్ పోజింగ్ చేయకుండా.. తనే ప్రధాన పాత్రలో ఉంటూ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూళ్లు చేస్తే.. క్యూ కట్టక ఏం చేస్తారు. మరి ఈ కొలమావు కోవెల కూడా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో చూడాలి. 

More Related Stories