English   

న‌య‌న్.. దాచుకోడానికి ఏం లేదింకా..!

nayanthara

ఇప్పుడు న‌య‌న‌తార తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. దాచుకోడానికి ఏమీ లేన‌పుడే అంతా ఓపెన్ చేస్తుంటారు. త‌న బంధం గురించి ప్ర‌పంచం మొత్తం తెలుసు అని ఫిక్సైన త‌ర్వాతే పూర్తిగా ఓపెన్ అయిపోయింది న‌య‌న‌తార‌. ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి త‌న బంధాన్ని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌కు అన్న‌ట్లుగా రెచ్చిపోతుంది. హాయిగా ఇప్పుడు అమెరికాలో విఘ్నేష్ తో క‌లిసి హాలీడే మూడ్ లో ఉంది న‌య‌న‌తార‌.  అస‌లు వీళ్ల క్లోజ్ నెస్ చూసి.. న‌య‌న‌తార పెళ్లైపోయింద‌ని.. విఘ్నేష్ శివ‌న్ నే ఆమె ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని చెబుతున్నారు. విఘ్నేష్ త‌న‌కు స్నేహితుడు మాత్ర‌మే అని చెబుతున్నా కూడా వీళ్ల చేత‌లు మాత్రం మ‌రోలా ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు అమెరికా వెళ్లారు. అక్క‌డే విఘ్నేష్ తో క‌లిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి.

ఈ ఒక్క‌టి చాలు ఇద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని తెల‌ప‌డానికి. వీళ్ల బంధం నేటికి కాదు.. రెండేళ్లుగా నీకునేను నాకునువ్వు అనేంత స్థాయిలో న‌య‌న‌, విఘ్నేష్ క‌లిసి పోయారు. వీళ్ల అన్యోన్య‌త‌ను చూసినోళ్ళే వీళ్ల పెళ్లి అయిపోయింద‌ని చెబుతున్నారు. అయితే పెళ్లి న‌య‌న‌తార‌కు అచ్చి రాలేదు. గ‌తంలో రెండు ప్రేమ‌లు కూడా ఇలాగే పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి విడిపోయాయి. దాంతో ఇప్పుడు విఘ్నేష్ తో ప్రేమ న‌డుస్తుంది కానీ పెళ్లి మాత్రం ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ వినిపిస్తుంది. కానీ మ‌రోవైపు పెళ్లి అయింద‌నే రూమ‌ర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎప్ప‌ట్లాగే ప్ర‌తీ గాసిప్ ను వింటూ ఎంజాయ్ చేస్తుంది కానీ నోరు విప్పి ఏం చెప్ప‌డం లేదు న‌య‌న‌తార‌. మ‌రి చూడాలిక‌.. ఈ జంట నిజంగానే కొత్త జంట అయిందో లేదంటే వార్త‌ల‌లా వినిపిస్తున్నాయో..?
 

More Related Stories