English   

గాల్లో గంతులేస్తున్న న‌య‌న ప్రియుడు.. 

Nayanthara-vignesh
2018-08-12 14:24:09

క‌లిసి తిర‌గ‌డానికి లేని భ‌యం.. బ‌య‌టికి చూపించుకోడానికి మాత్రం ఎందుకు..? అందుకే ఇప్పుడు న‌య‌న‌తార కూడా త‌న ప్రేమ‌తో పాటు అన్నీ బ‌య‌టికి చూపించేస్తుంది. ముసుగులో గుద్దులాట కూడా అన‌వ‌స‌రం అని ఫిక్సైపోయింది ఈ భామ‌. అందుకే ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ను ఫ్రెండ్ రేంజ్ నుంచి ప్ర‌మోష‌న్ ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. అందుకే ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ కూడా చేస్తున్నారు. కోకో సినిమా కోసం ఓ పాట‌ను విఘ్నేష్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. అది కూడా ప్రోమో సాంగ్. 

మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ న‌య‌న‌తార‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నానంటూ ట్వీట్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈమె కోసం క‌థ సిద్ధం చేస్తున్న విఘ్నేష్.. త్వ‌ర‌లోనే పూర్తి సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే మ‌నోడు ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. మొన్న సూర్య‌తో చేసిన త‌న సేరంద కుట్టం కూడా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు అవ‌కాశాలు కూడా లేవు. అందుకే న‌య‌నే ప్రియుడి బాధ్య‌త‌లు తీసుకుంటుంది. 

మూడేళ్లుగా నీకునేను నాకునువ్వు అనేంత స్థాయిలో న‌య‌న‌, విఘ్నేష్ క‌లిసి పోయారు. వీళ్ల అన్యోన్య‌త‌ను చూసినోళ్ళే వీళ్ల పెళ్లి అయిపోయింద‌ని చెబుతున్నారు. అయితే పెళ్లి న‌య‌న‌తార‌కు అచ్చి రాలేదు. గ‌తంలో రెండు ప్రేమ‌లు కూడా ఇలాగే పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి విడిపోయాయి. దాంతో ఇప్పుడు విఘ్నేష్ తో ప్రేమ న‌డుస్తుంది కానీ పెళ్లి మాత్రం ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ వినిపిస్తుంది. కానీ మ‌రోవైపు పెళ్లి అయింద‌నే రూమ‌ర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎప్ప‌ట్లాగే ప్ర‌తీ గాసిప్ ను వింటూ ఎంజాయ్ చేస్తుంది కానీ నోరు విప్పి ఏం చెప్ప‌డం లేదు న‌య‌న‌తార‌. మ‌రి చూడాలిక‌.. ఈ జంట నిజంగానే కొత్త జంట అయిందో లేదంటే వార్త‌ల‌లా వినిపిస్తున్నాయో..?

More Related Stories