English   

స్టార్ హీరోయిన్స్ డిజిటల్ యుద్ధం.. ఆన్‌లైన్‌లో ముద్దుగుమ్మల వార్.. 

Nayanthara Kajal Agarwal
2020-10-28 16:06:35

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు కానీ అప్పటి వరకు మాత్రం ఓటిటి కళకళలాడుతుంది. అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని చెప్పినా కూడా సగం టికెట్స్ అమ్మితే వర్కవుట్ కాదని ఒప్పుకోలేదు థియేటర్స్ యాజమాన్యం. అందుకే పక్క రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా తెరవలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నలుగురు స్టార్ హీరోయిన్స్ డిజిటల్ యుద్ధం చేయబోతున్నారు. రాబోయే రెండు నెలలు వాళ్లే ఓటిటిలో కనిపించబోతున్నారు. వాళ్లే సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార. వీళ్లు నటించిన వెబ్ సిరీస్, సినిమాలు నేరుగా ఆన్‌లైన్ రిలీజ్ అవుతున్నాయి. అన్నింటిపై ఆసక్తితో పాటు అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నయనతార నటించిన `ముకుతి అమ్మన్` హాట్ స్టార్ డిస్నీలో దీవాళికి విడుదల కానుంది. భక్తి పేరుతో దోచుకుంటున్న దొంగ బాబాలపై వ్యంగ్యాస్త్రం ఈ సినిమా. తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ మూకుతి అమ్మన్ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో అమ్మోరు తల్లిగా వస్తుంది ఈ చిత్రం. 

కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ కూడా నవంబర్‌లోనే విడుదల కానుంది. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి అప్లాజ్ సొంతం చేసుకుంది. తమన్నా కూడా నవంబర్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌తో OTTలోకి రాబోతుంది. ఇది కూడా నవంబర్‌లోనే డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అక్కినేని కోడలు సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ నుంచి స్ట్రీమ్ కానుంది. మనోజ్ బాజ్‌పెయి, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సమంత నెగిటివ్ రోల్ చేస్తుంది. మొత్తానికి నలుగురు హీరోయిన్లు ఒకేసారి ఓటిటిలో రాబోతున్నారు. మరి వీళ్ళలో ఎవరు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తారో చూడాలి. 

More Related Stories