English   

న్యాయం వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి.. దిశ ఎన్ కౌంటర్ పై నయనతార స్పందన..

nay
2019-12-08 09:30:56

దిశ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్లే కాకుండా రాజకీయ ప్రముఖులు సాధారణ జనం కూడా దిశ ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక అభం శుభం తెలియని 26 ఏళ్ల అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ దారుణ మారణకాండ చూసి.. నిందితులను వెంటనే చంపేయాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. దానికి తగ్గట్లుగానే ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులను కాల్చిచంపారు పోలీసులు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు నయనతార కూడా దిశా నిందితుల ఎన్కౌంటర్పై తన స్పందన తెలియజేసింది. న్యాయం అనేది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి అంటూ తనదైన శైలిలో ఒక లెటర్ విడుదల చేసింది. నయనతార సరైన సమయంలో సరైన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలు వాళ్లకు నా సలాం అంటూ నయనతార లెటర్ లో రాసింది.

ఏ రైట్ యాక్ట్ ఆఫ్ హ్యుమానిటీ అంటూ ఈ లేఖలో రాయడంతో ఎన్కౌంటర్ ను పూర్తిగా హర్షిస్తున్నట్లు తెలియజేసింది నయనతార. ఈ డేట్ ని దేశంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకోవాలని.. ఘటన జరిగిన తర్వాత సరైన న్యాయం చేసిన పోలీసులకు తెలంగాణ గవర్నమెంట్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. చిన్నప్పటి నుంచే పిల్లలకు సత్ప్రవర్తన నేర్పించాలని.. ముఖ్యంగా అబ్బాయిలకు బయట సొసైటీలో ఎలా మెలగాలనే విషయంపై బుద్ధులు నేర్పించాల్సిందే అని చెప్పింది నయనతార. సమాజంలో అమ్మాయిలను గౌరవంగా, క్షేమంగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళే నిజమైన హీరో అని అబ్బాయిలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అభిప్రాయపడింది నయనతార. ఈమె రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories