యూనిట్ మొత్తానికి గిఫ్ట్ లిచ్చిన నయన్ !

కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న నయనతార ఒకవైపు లేడీ ఒరియెంట్ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రలలో నటిస్తు బిజీగా ఉంది. అయితే ఓకే ఓకే ఫేమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నయనతార ఇటీవల ఆ సినిమాలో తన సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో షూటింగ్ పూర్తైన వెంటనే చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారందరికి కాస్ట్లీ ఫాసిల్ కంపెనీ వాచ్ లని గిఫ్ట్‌గా అందించిందట. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించినది. గతంలో కీర్తి సురేష్ కూడా పందెం కోడీ 2 చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నయన్ నటించిన మిస్టర్ లోకల్ సినిమాలో శివకార్తికేయన్ హీరో. పూర్తి రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మిస్టర్ లోకల్ ఏప్రిల్ 5న విడుదల కానుంది.