English   

నీదీ నాదీ నుంచి మరో పాట

Needhi-Naadhi-Oke-Katha

ఈ మధ్య కాలంలో అందరి అటెన్షన్ డ్రా చేసిన సినిమా నీదీనాదీ ఒకే కథ. వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతోన్న శ్రీ విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది. బిచ్చగాడు ఫేమ్ సత్నా టైటస్ హీరోయిన్ గా నటిస్తోంది. వేణు ఊడుగుల అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు విడుదల చేశారు. రెండు రొమాంటిక్ సాంగ్స్, ఒక ఫోక్ సాంగ్. ఈ మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. రిలీజ్ కు ముందే ఇది మా కథ అని చాలామంది ఓన్ చేసుకుంటోన్న సినిమా బహుశా ఈ మధ్య కాలంలో ఇదేనేమో. అందుకు కారణం టీజర్. చదువొక్కటే జీవితానికి పరమార్థం కాదు.. చదువుకుని బతికితేనే బతికినట్టు కాదు.. జీవితం అంటే మనకు నచ్చినట్ట బతకడం అనే కాన్సెప్ట్ ను టీజర్ లోనే చెప్పేశారు. అది చాలామంది టచ్ అయిపోయింది. అందుకు తగ్గట్టుగానే పాటలు కూడా ఓ రేంజ్ లో ఉండటంతో నీదీనాదీ ఒకే కథ.. నా కథ కూడా అని ఫీలయ్యేవారు పెరిగిపోతున్నారు.  ఈ నేపథ్యంలో ఉదయం పదిగంటలకు నీదీనాదీ ఒకటే కథ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేయబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు టీమే ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. అంటే ఇన్ డైరెక్ట్ గా నారా రోహిత్ కూడా నిర్మాణంలో భాగస్వామి అయి ఉన్నాడు. మొత్తంగా ఈ నాలుగో పాట కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది టీమ్. 

More Related Stories