English   

ప్రివ్యూ: నీదినాది ఒకేక‌థ‌.. 

Needi-Naadi-Oke-Katha-preview
2018-03-22 11:27:41

కొన్నిసార్లు టైటిల్ తోనే సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. ఇప్పుడు నీదినాది ఒకేక‌థ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. శ్రీ‌విష్ణు హీరోగా కొత్త ద‌ర్శ కుడు వేణు ఉడుగుల తెర‌కెక్కించిన సినిమా నీదినాది ఒకేక‌థ‌. ప్ర‌తీ ఇంట్లో జ‌రిగే క‌థ ఇదే కాబ‌ట్టి దీనికి టైటిల్ కూడా ఇదే పెట్టారు. ఇక్క‌డ నీదినాది అంటూ ప్రేక్ష‌కుల‌ది.. హీరోది అని అర్థం. అంటే హీరోనే చెబుతున్నాడు.. భ‌య్యా నీదినాది ఒకేక‌థ అని. అందుకే ఈ సినిమాపై ఆస‌క్తి కూడా పెరిగింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచేసింది. నారా రోహిత్ నిర్మాత కావ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా మంచి సినిమాలు చేస్తున్న శ్రీ‌విష్ణు.. ఈ సారి మాత్రం ఏదో మాయ చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మాత్రం ఒక్క హిట్ కూడా కొట్ట‌లేదు ఈ హీరో. మెంట‌ల్ మ‌దిలో ఓకే అనిపించిందే కానీ హిట్ కాదు. దాంతో ఇప్పుడు క‌చ్చితంగా నీదినాది ఒకేక‌థతో హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. బిచ్చ‌గాడు ఫేమ్ సప్న‌టైటిస్ ఈ చిత్రంలో హీరోయిన్. ద‌ర్శ‌కుడు దేవీప్ర‌సాద్ ఈ చిత్రంతో హీరో శ్రీ‌విష్ణుకు తండ్రిగా న‌టించాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే సినిమా అంతా. మార్చ్ 23న సినిమా విడుద‌ల కానుంది. ఒక్క‌రోజు ముందే భారీగా ప్రీమియ‌ర్ షోస్ వేస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. నీదినాది ఒకేక‌థ ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో..? 

More Related Stories