English   

నీదీ నాదీ రేపే ట్రైలర్

Needi-Naadi-Oke-Katha
2018-03-15 16:11:47

ఈ మధ్య కాలంలో చాలామంది అటెన్షన్ డ్రా చేసిన సినిమా నీదీనాదీ ఒకే కథ. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో సత్నా టైటస్ హీరోయిన్. ఈ బ్యూటీ బిచ్చగాడులో నటించింది. వేణు ఊడుగుల దర్శకుడు. శ్రీ విష్ణు భార్య ప్రశాంతి, నారా రోహిత్, గతంలో రోహిత్ తో అసుర సినిమా డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న ఈ టీమ్ తర్వాత టీజర్ తో ఒక్కసారిగా భలే ఉందే అనిపించారు. నేటి యంగ్ స్టర్స్ లా కాకుండా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటోన్న శ్రీ విష్ణు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడనే విషయం అర్థమైంది. ఇక సురేష్ బొబ్బిలి సంగీతంలో విడుదల చేసిన ఒక్కో పాటా సినిమాపై ఒక్కో రేంజ్ లో అంచనాలు పెంచుకుంటూ పోయింది. ఇప్పటికే వచ్చిన నాలుగు పాటలూ చాలా పెద్ద హిట్ అనిపించుకున్నాయి. ఇక సినిమాపైనా పూర్తిగా పాజిటివ్ బజ్ ఉంది. ఈ నేపథ్యంలో నీదీనాదీ ఒకే కథ ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నారు. 

ఈ నెల 23న నీదీనాదీ ఒకే కథ విడుదల కాబోతోంది. సినిమా ఎప్పుడో పూర్తయినా ప్రమోషన్స్ లో వీళ్లు పెద్దగా బయటకు రాలేదు. సినిమాతోనే మాట్లాడుకునేలా చేశారు. అలాగే ఇప్పుడు ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచబోతున్నారు. రేపు ఉదయం 9గంటలకు ఈ ట్రైలర్ రాబోతోంది. ఈ సందర్భంగా ఆ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఇన్నోవేటివ్ గా ఉంది. శ్రీ విష్ణు పోస్టర్ వెనక ఓ ప్రశ్న ఉంది. జీవితంలో మనిషికి కావాల్సిందేంటీ అనేది ప్రశ్న. కింద ఆప్షన్స్ గా ఏ. పెద్ద చదువు, బి. మంచి ఉద్యోగం, సి. పరువు, ప్రతిష్ట, డి. పైవేవీ కావు అని ఉంది. అయితే మొదటి మూడు ఆన్సర్స్ రాంగ్ టిక్ మార్క్ పెట్టి పైవేవీ కావు అనేది రైట్ టిక్ కొట్టారు. మొత్తంగా ముందు నుంచీ ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోనే వెళుతోన్న టీమ్ యూత్ నుంచి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిస్ చేసినట్టు లేదు. మరి రేపు విడుదల కాబోతోన్న ట్రైలర్ తో నీదీనాదీ ఒకే కథ అందరి కథ అనిపించుకుంటే చాలు.. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి. 

More Related Stories