English   

బొంగులో లైఫ్ కోసం ఏందీ సోది

Needi-Naadi-Oke-Katha
2018-03-16 16:59:36

సక్సెస్ కు సైడ్ ట్రాక్స్ ఉంటాయా..? ఇన్ని మెట్లు ఎక్కితే విజయం వరిస్తుందని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా..? ఖచ్చితంగా ఇది అసాధ్యం. అందుకే అవి నమ్ముకుంటే గెలవడం అటుంచి.. గెలుపుపై నమ్మకమూ పోతుంది. అందుకే మనసుకు నచ్చింది చేయాలంటారు. ఎవరి కోసమో ఏదైనా చేస్తే అందులో మనకు ఏ సంతృప్తీ ఉండదు. ఇదే నీదీనాదీ ఒకే కథ చెబుతోన్న కథ. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నీదీనాదీ ఒకే కథ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ట్రైలర్ ను బట్టి శ్రీ విష్ణు మరోసారి జెన్యూన్ గా ఎంటర్టైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. సినిమాపైనా పూర్తి నమ్మకాన్ని పెంచిందీ ట్రైలర్.

పొద్దున్నే చదువుకోవడానికి కొడుకు అలారం పెడితే పేరెంట్స్ కామెడీ అనిపించడం, హీరో ఇంకా ఆది మానవుడి స్టేజ్ లోనే ఉన్నాడని హీరోయిన్ ఇన్ డైరెక్ట్ గా అతన్ని వేస్ట్ ఫెలో అనేయడం వంటివన్నీ యూత్ కే కాదు యవ్వనం దాటి వచ్చిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేవే. ఎప్పుడు చస్తామో తెలియని ఈ బొంగులో లైఫ్ కోసం ఏంట్రా మీసోదంతా అనే డైలాగ్ హైలెట్.  వేణు ఊడుగుల అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన సినిమా నీదీనాదీ ఒకే కథ. సురేష్ బొబ్బిలి సంగీతంలో వచ్చిన నాలుగు పాటలూ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ నెల 23న సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఎప్పుడు పోతామో తెలియని జీవితం గురించి హైరానా పడటం.. మరెన్నో లక్ష్యాలు పెట్టుకోవడం.. జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించకుండా.. కాలంతో పరుగులు పెట్టడం ఎంత వరకూ కరెక్ట్ అనే ప్రశ్నల్నీ లేవనెత్తబోతోన్న ఈ కథ ట్రైలర్ తోనే మనందరి కథ అనిపించుకుంటోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 
 

More Related Stories