English   

బజ్ లేకనేనా ఈ హిలేరియస్ ట్రైలర్ లు..?

Neevevaro-Comedy-Teasers
2018-08-23 16:46:14

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నీవెవరో’. ఓ తమిళ్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ మూవీ కంప్లీట్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. అయితే ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.. కానీ ఈ స్పందన కేవలం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికే పరిమితమైంది. దీంతో మిగతా ఆడియన్స్ పట్టించుకోరనే డౌట్స్ సినిమా వారిలో పెరిగాయి. నిజానికి ఆది పినిశెట్టి ఈ మధ్య చేసిన అన్ని సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. కానీ అవన్నీ అతను హీరోగా చేసినవి కావు. విలన్ గా చేసిన సరైనోడు సూపర్ హిట్ అయింది. అజ్ఞాతవాసి ఆడకపోయినా అందులో ఆది పాత్ర అస్సలు లేదు. తర్వాత నిన్నుకోరి, రంగస్థలం సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్నాడు కూడా. ఇప్పుడు నీవెవరో సినిమా రేంజ్ ఈ సినిమాలతో పెరగదు. అలాగని అందరు ఆడియన్స్ ను రప్పించలేడు. ఈ విషయం మేకర్స్ కు బాగా అర్థమైంది. దీనికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనుకున్నంత గొప్పగా లేదు. అందుకే కొత్తగా ‘హిలేరియస్ ట్రైలర్’ అంటూ కామెడీ ట్రైలర్ వదిలారు. 

ఈ కామెడీ ట్రైలర్ కోసం ఏకంగా రామ్ చరణ్ ను రంగంలోకి దించారు. చరణ్ చేతుల మీదుగా ఈ హిలేరియస్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ నవ్వులు పూయించింది కానీ.. మరీ రిలీజ్ డేట్ బాగా దగ్గరగా వచ్చాక చేసిన ఈ ప్రయత్నం అనుకున్న రిజల్ట్ ఇస్తుందనేది డౌటే. ఈ ట్రైలర్ చూపించి మా సినిమా మీరనుకున్నంత సీరియస్ థ్రిల్లరేం కాదు.. కాబట్టి హాయిగా నవ్వుకోవచ్చు.. ప్లీజ్ రండి అని పిలుస్తున్నట్టుగా ఉందనే సెటైర్స్ కూడా పడుతున్నాయి. ఏదేమైనా ఆది పినిశెట్టి టాలెంటెడ్ యాక్టర్. కానీ యాక్టర్లో ఉన్న టాలెంట్ ఎప్పుడూ సినిమాలను హిట్ చేయలేదు.. మరి ఈ విషయం ‘సమర్పుకుడు’ కోన వెంకట్ కు బాగా తెలిసే ఈ హిలేరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు. 

More Related Stories