English   

అమ్మో ఇలా వర్కవుట్ చేస్తే.. నేహా సిస్టర్స్ సెగలు..

nehasharma
2020-04-01 07:01:53

ఇప్పుడు నేహా శర్మ తన చెల్లితో కలిసి చేస్తున్న వర్కవుట్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఏ ఇండ‌స్ట్రీలో అయినా అక్కాచెల్లెళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇద్ద‌రిలో క‌చ్చితంగా ఒక్క‌రైనా స్టార్ అవుతుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం ఒక్క‌రు కూడా స్టార్ కాలేక‌పోయారు. పైగా ఇద్ద‌రూ ఫుల్లుగా అందాలు ఆర‌బోసినా కూడా లాభం అయితే లేకుండా పోతుంది. ఇప్పుడు శ‌ర్మ సిస్ట‌ర్స్ ను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. వీళ్ల‌ను చూస్తుంటే మ‌రో మాట లేకుండా ఇదొక్క‌టే గుర్తొస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఇండ‌స్ట్రీకి సిస్ట‌ర్స్ రావ‌డం.. ఇక్క‌డ సెటిల్ కావ‌డం కొత్తేం కాదు. ఎప్ప‌ట్నుంచో జ‌రుగుతుంది ఇది. అందం ఉంది.. దాన్ని ఆర‌బోసే గుణం ఉంది కానీ ఎందుకో మ‌రి బ్రేక్ అయితే రాలేదు. తెలుగు, హిందీల్లో స్టార్స్ తో న‌టించిన త‌ర్వాత కూడా నేహాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇక ఆమె చెల్లి ఐషాశ‌ర్మ‌ను అయితే అస్స‌లే ప‌ట్టించుకోలేదు. అమ్మడు ఆ మ‌ధ్య అదిరిపోయే బికినీ షోతో పిచ్చెక్కించింది. కానీ కోరుకున్న వాళ్ల నుంచి ఆఫ‌ర్ అయితే రాలేదు. ఏ ద‌ర్శ‌కుడు క‌నీసం క‌రుణించ‌లేదు. దాంతో ఇప్ప‌టికీ ఈ సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ త‌మ‌దైన అందాల ఆర‌బోత‌తో సెగ‌లు రేపుతున్నారు. ఇప్పుడు కూడా కరోనా ఉండటంతో ఇంట్లోనే హాట్ హాట్ గా వర్కవుట్స్ చేస్తున్నారు. ఇద్ద‌రూ ఒకర్ని మించి మరొకరు సెగ‌లు పుట్టిస్తున్నారు. అక్క‌కు చెల్లి.. చెల్లికి అక్క ప్రోత్సాహం ఇచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికైనా వీళ్ల‌ను చూసి కాక‌పోయినా.. క‌నీసం వీళ్ల అందాల‌ను చూసైనా ఎవ‌రో ఓ ద‌ర్శ‌కుడు అవ‌కాశం ఇవ్వ‌కుండా పోతాడా..?

 

More Related Stories