English   

నేల‌టికెట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. దారుణం..!

Nela Ticket First Day Collections
2018-05-26 21:23:37

స్టార్ హీరో సినిమా అంటే టాక్ తో ప‌నిలేకుండా తొలిరోజు వ‌సూళ్ల వ‌ర్షం కుర‌వాలి. ప్ర‌తీచోట హౌజ్ ఫుల్ బోర్డులు క‌నిపించాలి. అలా అయితేనే ఇమేజ్ ఉన్న‌ట్లు.. లేదంటే ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా త‌గ్గిపోయిన‌ట్లే. మార్కెట్ ప‌డిపోయిన‌ట్లే. ఇప్పుడు ర‌వితేజ విష‌యంలో ఇది జ‌రుగుతుంది.  ఈ హీరో సినిమాను తొలిరోజు చూడ్డానికి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఉత్సాహం చూపించ‌ట్లేదు. మాస్ రాజా అనే ఇమేజ్ ఉన్నా ఇప్పుడు మార్కెట్ మాత్రం మ‌రీ దారుణంగా ప‌డిపోయింది. దీనికి నేల‌టికెట్ ఫ‌స్ట్ డే క‌లెక్షన్సే నిద‌ర్శ‌నం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.41 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ర‌వితేజ గ‌త సినిమా ట‌చ్ చేసి చూడు తొలిరోజు 4.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది.. దానికి ముందొచ్చిన రాజా ది గ్రేట్ 5.60 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అంటే సినిమా సినిమాకు ర‌వితేజ మార్కెట్ ప‌డిపోతుంది. ఇదే ప‌రిస్థితి కానీ ఉంటే రేపు శీనువైట్ల సినిమా ప‌రిస్థితి ఎలా ఉంటుందో..? అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీకి కానీ పాజిటివ్ టాక్ రాక‌పోతే ర‌వితేజ మార్కెట్ మ‌రింత దిగ‌జార‌డం ఖాయం. మ‌రి చూడాలిక‌.. ఇప్ప‌ట్నుంచైనా మాస్ రాజా మేల్కొంటాడో లేదో..? 

More Related Stories