English   

నువ్వు పెద్ద పులి అంటోన్న రవితేజ 

Nela-Ticket
2018-03-26 08:36:26

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ నేలటిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు రవితేజ. ఆల్రెడీ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 25న నేల టిక్కెట్టు బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈమూవీ నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది టీమ్. రవితేజ తనదైన ఎనర్జిటిక్ లుక్ తో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఇదే పండగ వాతావరణంలో వచ్చే పాటలోని స్టిల్ లా కనిపిస్తోంది. వెనక పోతరాజులు, పులివేషాలు ఉన్న మనుషులున్నారు. దీన్ని బట్టి ఇదో రేంజ్ మాస్ సాంగ్ గానూ అర్థమౌతోంది. సింపుల్ గా చెప్పాలంటే బోనాల సందర్భంగా వచ్చే నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో వంటి సాంగ్ అనుకోవచ్చు. ప్రస్తుతం రవితేజ్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఆ హిట్ నేలటిక్కెట్టుతో వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి అతని కాన్ఫిడెంట్ నిజమవుతుందా లేదా అనేది ఈ మూవీ టీజరో లేక ట్రైలరో చూస్తే కానీ చెప్పలేం. 

More Related Stories