English   

నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నాకించేస్తారు..

Nela-ticket

అంటున్నాడు రవితేజ. మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ నేల టిక్కెట్టు టీజర్ విడుదలైంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. రవితేజ ఇమేజ్ తగ్గ కథతోనే వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా డైలాగ్స్ ను బట్టే ఈ కథ అర్థమైపోతోంది. ‘చుట్టూ జనం మధ్యలో మనం’ అలా ఉండాల్రా లైఫ్ అంటే అనే డైలాగ్ కథలోని పాయింట్ ను తెలియజేస్తోంది. అలాగే నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అనే డైలాగ్ సూపరంతే. రవితేజ మళ్లీ మునుపటి లుక్ లో కనిపిస్తున్నాడు. గత కొన్ని సినిమాల్లో ఏజ్ బార్ అయిన ఛాయలు బాగా కనిపించాయి. కానీ ఈ ‘టీజర్’అవి కనిపించలేదు. సినిమా అంతా ఇలాగే ఉంటే ఖచ్చితంగా మళ్లీ పాత రవితేజను చూస్తాం అనుకోవచ్చు.  ఇక అలీ, ప్రవీణ్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ మాళవిక శర్మ క్యూట్ గా ఉంది. ఏరా తినేస్తావా అంటూ రవితేజను బెదిరిస్తుంది కూడా. కానీ ఆ తర్వాత మాస్ రాజా ఎక్స్ ప్రెషన్స్ తో చంపేశాడంతే. టీజర్ ను బట్టి ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా అర్థమౌతోంది. అలాగే హీరోయిన్ మాళవిక మెడికల్ స్టూడెంట్ అని తెలుస్తోంది. అయితే విలన్ గా నటిస్తోన్న జగపతిబాబును మాత్రం పరిచయం చేయలేదీ టీజర్ లో. ఆయన కోసం మళ్లీ కొత్తగా ఏమైనా టీజర్ వదులుతారేమో. మొత్తంగా టీజర్ కే విజిల్స్ వేసేలా పవర్ ప్యాక్డ్ గా ఉంది. శక్తికాంతన్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మూవీతో తెలుగులోకి ఎంటర్ అవుతున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న నేల టిక్కెట్టు మే 25న విడుదల కాబోతోంది. 

More Related Stories