English   

గెట్ రెడీ.. నేల‌టికెట్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది..!

Nela-ticket

విజిల్ కొట్ట‌డానికి రెడీగా ఉండండి.. ఎందుకంటే నేల‌టికెట్ తీసుకుని వ‌చ్చేస్తున్నాడు ర‌వితేజ‌. ఈ చిత్ర పాట‌లు విడుద‌లైనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ అయితే రాలేదు. ఒక‌ప్పుడు ఆడియో వేడుక‌లోనే ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆన‌వాయితీ. కానీ ఇప్పుడు ట్రైల‌ర్ లాంఛ్ కు కూడా ప్ర‌త్యేకంగా ఓ డేట్ అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈ చిత్ర ఆడియో మే 10న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జ‌రిగింది కానీ ట్రైల‌ర్ మాత్రం మే 16 సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మేర‌కు పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు రెస్పాన్స్ బాగుంది. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర టీజ‌ర్ లో ప‌క్కా మాస్ అవ‌తార్ లో క‌నిపించాడు మాస్ రాజా. టీజ‌ర్ లో పెద్ద‌గా క‌థ చెప్ప‌క‌పోయినా.. ర‌వితేజ కారెక్ట‌రైజేష‌న్ ను మాత్రం పూర్తిగా చెప్పేసాడు క‌ళ్యాణ్.  ఈ చిత్రాన్ని న‌లుగురులో మ‌నం ఉండాలి.. ఆ న‌లుగురు బాగుండాల‌నే కాన్సెప్ట్ తో తెర‌కెక్కించాడు క‌ళ్యాణ్. త‌న రెండు సినిమాల‌కు పూర్తిభిన్నంగా నేల‌టికెట్ ను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. సోగ్గాడే.. రారండోయ్ సినిమాలు పూర్తి క్లాస్ సినిమాలుగా వ‌స్తే ఇప్పుడు ర‌వితేజ సినిమా మాత్రం ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తుంది. ఇది చూసిన త‌ర్వాత క‌ళ్యాణ్ ఎంతగా మారిపోయాడో అర్థం అవుతుంది. ఈ చిత్రంలో మ‌ళ‌యాల భామ మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రం మే 24న‌ విడుద‌ల కానుంది. ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ర‌వితేజకు నేల‌టికెట్ ఫ‌లితం కీల‌కంగా మారింది. 

More Related Stories