English   

నేలటిక్కెట్టు..  ఊరమాస్.. పైసా వసూల్..

Nela-Ticket

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ నేల టిక్కెట్టు ట్రైలర్ రిలీజ్ అయింది. మాస్ రాజా జోష్ కు ఏ మాత్రం తగ్గకుండా దుమ్మురేపాడీ ట్రైలర్ తో. సాఫ్ట్ గా మొదలై.. మాస్ ను ఊరమాస్ గా వెళ్లిపోయిందీ ట్రైలర్. రవితేజ్ లుక్ బావుంది. హీరోయిన్ మాళవిక శర్మ క్యూట్ గా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంది. జగపతిబాబు ఎంట్రీతో ట్రైలర్ లుక్కే మారిపోయింది. ఒక్కసారిగా మాస్ మోడ్ లకి వెళ్లిపోయిందీ నేల టిక్కెట్టు. ‘నా లైఫ్ నా ఇష్టం రా నేను ఎదగడానికి ఎవడినైనా తొక్కేస్తా’, ‘నేను ఇక్కడ కూర్చుంటే స్టేటంతా నా కుర్చీ ముందు మోకాళ్లపై డేకుద్దీ’అంటూ గ్గూభాయ్ చెప్పే డైలాగ్స్ తో అతని క్యారెక్టర్ ను కూడా ఎలివేట్ చేశారు.. చూడ్డానికి అతను మల్టీ మిలియనీర్ లా ఉన్నాడు. అలాంటి వాడితో నేల టిక్కెట్టు బ్యాచ్ కు చెందిన హీరో ఢీ కొట్టడం అనేది ఇంక వేరే చెప్పక్కర్లేదేమో.. ఇక ముసలి తనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా చెప్పొచ్చు. నిజమే ఎంతోమంది కష్టాల్లో ఉన్నా వాళ్లకు సాయం చేయడానికి ఒక్కడూ ముందుకు రావడం లేదనే ఆవేదన నుంచి హీరోవారికి సాయంగా మారేలా కనిపిస్తాడేమో.. అనేలా ఉందీ ట్రైలర్. ఫినిషింగ్ లో నువ్వు రావడం కాదురా.. నేనే వస్తా.. అప్పటి వరకూ ఇదే మూడ్ కంటిన్యూ చెయ్ అనే డైలాగ్ మరో హైలెట్. ఇక శక్తికాంతన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు బిగ్గెస్ట్ అస్సెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్ లోనే ఆర్ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా కనిపిస్తోంది. చూడ్డానికి రవితేజ మార్క్ రొటీన్ ఎంటర్టైనర్ లానే కనిపిస్తోన్న ఏదో ఉంది అనిపిస్తోంది. రొటీన్ బట్ నాట్ రెగ్యులర్ అన్నట్టు అనుకోవచ్చు. ఇక ట్రైలర్ లోనే దాదాపు సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ను పరిచయం చేశాడు దర్శకుడు. చాలామంది కమెడియన్స్ కనిపిస్తున్నారు.. అన్నట్టు బ్రహ్మానందం కూడా మెరిశాడు.. రవితేజ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. అతని మార్క్ లో సాగేలా ఉన్న ఈ ఎంటర్టైనర్ లో కాస్త మంచి కథ కూడా పడితే ఖచ్చితంగా ఇది మాస్ రాజాకు మరో హిట్ అవుతుంది. హిట్ అయినా కాకపోయినా ట్రైలర్ ను బట్టి చూస్తే మాత్రం ఇది పక్కా పైసా వసూల్ మూవీలా కనిపిస్తోంది.. 

More Related Stories