English   

రవితేజకు భారీ షాక్

Nelaticket shock to Raviteja
2018-05-26 10:17:10

మాస్ మహరాజ్ రవితేజకు నేలటిక్కెట్టు భారీ షాకిచ్చింది. ఎప్పట్లానే తన ఎనర్జిటిక్ నటన చూపిస్తే సినిమాలు పాసైపోతాయనుకున్న అతని ఓవర్ కాన్ఫిడెన్స్ కు నేలటిక్కెట్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పటికే గత సినిమా టచ్ చేసి చూడు డిజాస్టర్ అయి ఉంది. అయినా ఏ మాత్రం కొత్తదనం లేని కథతో వచ్చిన రవితేజకు మరో ఫ్లాప్ తోడైంది. కథలో దమ్ములేదు.. కథనంలో పసలేదు.. రవితేజ బాడీ లాంగ్వేజ్ పరమ రొటీన్ గా ఉంది. ఇక దర్శకుడు ప్రేక్షకుల స్థాయిని తక్కువగా అంచనా వేసి తీశాడా అని ప్రతి సీన్ కూ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఏ మాత్రం డౌట్ లేకుండా నేలటిక్కెట్టు ఫ్లాప్ అని డిసైడ్ అయింది. అయితే ఇప్పుడీ సినిమా పోవడం కంటే పెద్ద షాక్ మరోటి ఉంది రవితేజకు. 

నేలటిక్కెట్టు తర్వాత రవితేజ మైత్రీ మూవీస్ బ్యానర్ లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు. రవితేజ కంటే వీర ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకుడు. సో.. వాళ్లకు శ్రీను పై పెద్దగా నమ్మకం లేదు. ఇప్పుడు రవితేజపైనా ఉన్న నమ్మకం పోయింది. దీంతో ఆ నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని టాక్. అందుకే నేలటిక్కెట్టు విడుదలైన రత్వాత అసలు నిర్మాతల కంటే ఎక్కువగా ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచే సినిమా రిజల్ట్ గురించి ఎక్కువ ఫోన్స్  మీడియాకు, డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ కు వెళ్లాయట. ఇక సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో మైత్రీ మూవీస్ లోనూ ఆందోళన మొదలైందని టాక్. రిజల్ట్ తెలిసిన తర్వాత వారు ఇకపై సినిమాకు సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా రవితేజకు ఇది ఫైనల్ వార్నింగ్ అనుకోవచ్చు. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ ఏ మాత్రం తేడా వచ్చినా.. ముందు శ్రీను వైట్ల కెరీర్ పూర్తి ప్రమాదంలో పడుతుంది. తర్వాత హీరోగా రవితేజ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఇది మాత్రం నిజం. 

More Related Stories