English   

నువ్వు వర్జినా.. హీరోయిన్ కు సూటి ప్రశ్న వేసిన ఆకతాయి..

avtress
2020-03-26 07:05:20

సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఉంటారు. వాళ్ళు కేవలం ఇతరులను టార్గెట్ చేయడానికి వాళ్లపై కుళ్ళు జోకులు వేయడానికి మాత్రమే ఉంటారు. ముఖ్యంగా వాళ్ల టార్గెట్ అమ్మాయిలు.. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అల్లరి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ఒక మలయాళీ హీరోయిన్ ని ఏకంగా ఒక ఆకతాయి నువ్వు వర్జిన కాదా అని అడిగాడు. మలయాళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంయుక్త మీనన్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ తమిళనాట కూడా సత్తా చూపిస్తుంది సంయుక్త. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు తన సోషల్ మీడియాలో కావాలని టార్గెట్ చేస్తున్నట్టు తెలిపింది. ఈమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించే సమయంలో ఓ నెటిజన్ సంయుక్త మీనన్ ని అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు.

మీరు వర్జినా అంటూ ప్రశ్నించాడు. దీనితో సంయుక్త మీనన్ కోపంతో అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మిస్టర్ అతుల్ పీకే.. నీలాంటి వాళ్ళకు అమ్మాయిలు కేవలం ఆటబొమ్మలా కనిపిస్తారు.. నీలాంటి కొందరు ఆకతాయిలు వర్జినిటీ, సెక్స్, ఆల్కహాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు అంటూ  అతడిని ఓ రేంజ్ లో  విమర్శించింది సంయుక్త. ఆడవాళ్లు కానీ అమ్మాయిలు కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నువ్వు చూసావా అంటూ విరుచుకుపడింది. నీకు గాని కేవలం ఇలాంటివి ఇష్టమైతే కచ్చితంగా నీలో ఒక సమస్య ఉన్నట్లే అంటూ ఆ కుర్రాడిని చెడా మడా తిట్టింది. ఇలాంటి కామెంట్స్ కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. నీ చెంప...పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని సంయుక్త మీనన్ సదరు ఆకతాయికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరాలుగా స్పందిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది.

More Related Stories