English   

నాని దగ్గర డబ్బుల్లేవా.. సోషల్ మీడియాలో సూక్తులు మాత్రం బాగా చెప్తున్నాడు..

nani
2020-04-01 08:04:08

అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని మీద నడుస్తున్న ట్రోలింగ్ అయితే ఇదే. నిజానికి aకరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు కూడా గడప దాటకుండా ఇళ్లలో కూర్చొని ప్రజలను సోషల్ మీడియా ఉత్తేజ పరుస్తున్నారు. ద్వారా సూచనలను ఇస్తున్నారు. కందరి ఇళ్లలో కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. హీరో నాని కూడా కరోనా దెబ్బకు ఇంట్లో వంట ప్రయోగాలు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వారికి ఇంటి, వంట పనులలో సాయపడుతున్నాడు. సంపూర్ణేష్ బాబు, సప్తగిరి లాంటి వాళ్ళు కూడా విరాళం అందించారు. ఎప్పుడో ఇండస్ట్రీ మరిచిపోయిన నారా రోహిత్ ఏకంగా 30 లక్షలు ఇచ్చాడు. కానీ ఒక స్టార్ హీరో అయ్యుండి ఇప్పటి వరకు విరాళం ఊసే ఎత్తడం లేదు నాని. అసలు ఈయన్ని చూస్తుంటే ఈయన దగ్గర డబ్బుల్లేవా అని చాలా మంది ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో సూక్తులు మాత్రం బాగా చెప్తున్నాడు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నాని మీద ట్రోలింగ్ కు అయితే అంతే లేదు. నిన్నగాక మొన్నొచ్చిన విశ్వక్ సేన్ కూడా తన స్థాయిలో ఎంతో కొంత ఇచ్చాడు. కానీ అతనిని హీరోగా పెట్టుకుని సినిమా తీసున నువ్వు డబ్బు ఇవ్వలేక పోతున్నావా అని ట్విట్టర్ లో డైరెట్ గా అడుగుతున్నారు అభిమానులు. 

More Related Stories