English   

పాపం విరాళానికి డబ్బుల్లేవా విజయ్ దేవరకొండ..

vijay
2020-03-31 19:38:13

ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై నడుస్తున్న ట్రోలింగ్ ఇదే. ఇప్పటికే చిన్న చిన్న నటులు కూడా విరాళం అందించారు. సంపూర్ణేష్ బాబు కూడా తనవంతుగా లక్ష రూపాయలు ఇచ్చాడు. దాంతో పాటు ఎప్పుడో ఇండస్ట్రీ మరిచిపోయిన నారా రోహిత్ 30 లక్షలు ఇచ్చాడు. ఇంకా సప్తగిరి, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లు కూడా తమకు తోచిన సాయం చేసారు. అలాంటిది స్టార్ హీరో అయ్యుండి ఇప్పటి వరకు విరాళంపై ఇంకా స్పందించలేదు విజయ్ దేవరకొండ. అసలు ఈయన్ని చూస్తుంటే చాలా మంది ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్య వరస ఫ్లాపులు వచ్చాయి కదా పాపం విజయ్ తో డబ్బులు లేవేమోలెండీ అంటూ భారీగానే సెటైర్లు వేస్తున్నారు. ఇంక సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు అయితే లెక్కేలేదు. ఇన్ని కోట్లు తీసుకుంటే కొన్ని లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నావా విజయ్ అంటూ మనోడిపై సెటైర్ల వర్షం పడుతుంది. నిన్నగాక మొన్నొచ్చిన విశ్వక్ సేన్ కూడా 5 లక్షలు ఇచ్చాడు.. ఎప్పట్నుంచో ఉన్న నువ్వు ఇవ్వవా అంటూ నేరుగానే ట్విట్టర్ లో విజయ్ ను అడుగుతున్నారు అభిమానులు. దీనికి ఆయన ఏం సమాధానం కూడా చెప్పడం లేదు. ఇస్తాడేమో వెయిట్ చేద్దామని కొందరు అంటున్నా.. ఇంకెప్పుడు ఇస్తాడు ఇండస్ట్రీ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ రివర్స్ పంచులు పేలుతున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండపై అయితే ప్రస్తుతం విరాళాల ప్రెజర్ బాగానే ఉంది.

More Related Stories