English   

జూలై 27 చాలా హాట్ గురూ.. 

next movie
2018-07-23 16:54:12

గత కొంతకాలంగా థియేటర్స్ లో పెద్ద సినిమాల సందడి లేదు. దీంతోచిన్న సినిమాలన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ దొరకడమే ఆలస్యం పోటీ ఎంత ఉంది.. మన సినిమా నిలబడుతుందా అనేది కూడా చూడ్డం లేదు కొందరు. ఏదో విడుదలైతే చాలు అనుకుంటున్నారు మరికొందరు. ఇంకొందరైతే.. ముందే డేట్ ఫిక్స్ చేసుకున్న డేట్ ప్రకారం ‘ఆట’ తప్పకుండా వస్తున్నారు. అలా ఈ నెల 27న కూడా దాదాపు అరడజను సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయో కానీ.. ముందే డేట్ ఫిక్స్ చేసుకున్న సాక్ష్యం మాత్రమే హాట్ గా కనిపిస్తోందీ వారం. 

బెల్లకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా సాక్ష్యం. శ్రీవాస్ దర్శకుడు. పంచభూతాలను కథలో మిళితం చేసుకుని థ్రిల్లర్ గా తెరకెక్కించినట్టు ఈ మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ మూవీని భారీ రేట్ తో థియేట్రికల్ రైట్స్ తీసుకుంది. దీంతో అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ 27న వస్తోన్న సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమా సాక్ష్యం మాత్రమే. 

మెగా డాటర్ నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా ఈ నెలలోనే వస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఇది కూడా ఈ నెల 27నే వస్తోంది. ట్రైలర్ ఆకట్టుకుంది. కాన్సెప్ట్ కూడా బావుందనే టాక్ ఉంది. బట్.. లీడింగ్ పెయిర్ కు ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే సత్తా ఉందా అనేదే డౌట్.

హాలీవుడ్ సిరీస్ లో జేమ్స్ బాండ్ తర్వాత టాప్ ప్లేస్ లో నిలిచేది మిషన్ ఇంపాజిబుల్. టామ్ క్రూయిజ్ హీరోగా నటించిన ఈ సిరీస్ లోని మరో సినిమా వస్తోంది. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫాల్ అవుట్’ పేరుతో వస్తోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఈ నెల 27న వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ బ్రెత్ టేకింగ్ గా ఉంది. పైగా టామ్ క్రూయిజ్ కు ఇండియాలోనూ, తెలుగులోనూ భారీ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి మిగతా సినిమాలకు ఈ మిషన్ ఇంపాజిబుల్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు.

ఇక త్రిష ప్రధాన పాత్రలో నటించిన మోహిని కూడా 27నే వస్తోంది. ఇది తమిళ సినిమా.తెలుగులో డబ్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక మనసుకు నచ్చింది, పెదవి దాటనిమాటొకటుంది వంటి సినిమాలు కూడా 27నే రాబోతున్నాయి. ఇవి కాక మరో రెండు మూడు సినిమాలు సడెన్ గా డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ఈ మొత్తంలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరో చూడాలి. 

More Related Stories