English   

వచ్చే వారమే రంగస్థలం...?

ram charan
2018-02-19 15:18:32

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తోన్న రంగస్థలం మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతోంది. రంగస్థలం సినిమా కాదు.. టైటిల్ సాంగ్. అంటే రంగస్థలం పాట అన్నట్టే కదా. మొత్తానికి రీసెంట్ గా రిలీజ్ చేసి ఎంత సక్కాగున్నావె పాటకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. డిజిటల్ మీడియాలో వ్యూయర్ షిప్ కూడా రికార్డ్ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీలో డిజే బ్యూటీ పూజా హెగ్డే ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఫస్ట్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంటైర్ టీమ్ ఉబ్బితబ్బిబ్బయిపోయిందట. అందుకే ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి సిద్ధమైంది. 
వారం రోజుల్లో  రంగస్థలం టైటిల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఈ పాట కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఎంత సక్కగున్నావె పాట కంటే కూడా మరో బెస్ట్ సాంగ్ ఈ ఆల్బమ్ లో ఉంటుందట. ఆ పాట మైండ్ బ్లోయింగ్ గా ఉంటుదని ఇన్నర్ సోర్స్ నుంచి వస్తోన్న న్యూస్. అలాగే ఈ రెండు పాటలు విడుదల చేసిన తర్వాత ఏకంగా మార్చి లాస్ట్ వీక్ లో మొత్తం పాటలను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తారట. ఈ లోగా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో ముందుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ తర్వాత మరోసారి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారట. మొత్తంగా ఈ కార్యక్రమాలన్నీ ఒక టైమ్ ప్రకారం చేసుకుంటూ వెళుతూనే ప్రమోషన్స్ లోనూ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కాగా రిలీజ్ డేట్ వరకూ కంటిన్యూ అయ్యేలా చూసుకుంటోందట రంగస్థలం టీమ్. చూస్తోంటే ఇది చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఉందంటున్నారు చాలామంది. సో.. వచ్చే వారం విడుదలయ్యే సాంగ్ ను బట్టి ఈ రేంజ్ తెలుస్తుందేమో.

More Related Stories