English   

జూనియర్ ఎన్టీఆర్ NHKమొదలు పెడుతున్నాడా..

NTR
2020-03-21 15:38:56

ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కేవలం నటులుగానే కాకుండా నిర్మాతలుగా కూడా బిజీగా ఉన్నారు. ఎవరికివారు సొంతంగా నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే దారిలో వెళుతున్నాడు. ఈయన కూడా తనకంటూ ప్రత్యేకంగా ఒక కొత్త నిర్మాణసంస్థ మొదలు పెడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనికి తన తండ్రి పేరు పెడుతున్నాడు. నందమూరి హరికృష్ణ పేరుతో బ్యానర్ మొదలు పెడుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించాలని ఆలోచిస్తున్నాడు ఈయన. ఇప్పటికే దీనికి హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. అయితే వీరిద్దరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ స్లీపింగ్ పార్టనర్ గా ఉండాలని ఆలోచిస్తున్నాడు. 

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే నాగార్జున రామ్ చరణ్ చిరంజీవి మహేష్ బాబు సందీప్ కిషన్ నితిన్ కళ్యాణ్ రామ్ ఇలా ప్రతిఒక్కరూ ఒక్కరూ తనకంటూ ప్రత్యేకంగా ఒక సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల సినిమాలను అందులో స్లీపింగ్ పార్టనర్ చేస్తున్నారు. దానివల్ల రెమ్యునరేషన్ బదులు షేర్ ఎక్కువగా వస్తుంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇకపై తాను చేయబోయే ప్రతి సినిమాను తన నిర్మాణ సంస్థ స్లీపింగ్ పార్టనర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కథ నచ్చితే నందమూరి హరికృష్ణ బ్యానర్ లో బయట హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు జూనియర్. 

More Related Stories