English   

అందాల నిధి అస్స‌లు దాచుకోదుగా..!

nidhi agarwal bold
2018-05-28 11:35:49

నిధి అంటేనే ఖ‌జానా అని అర్థం. ఇక ఇదే పేరు ముద్దుగుమ్మ పెట్టుకుంటే అందాల ఖ‌జానా అని అర్థం. ఇప్పుడు నిధి అగ‌ర్వాల్ ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. చిన్న‌పుడే అనుకున్నారో ఏమో కానీ ఈమెకు స‌రైన పేరు పెట్టారు. ఇప్పుడు ఈ అందాల నిధిని చూడ్డానికి రెండు క‌ళ్లు కూడా స‌రిపోవ‌డం లేదు. అంత‌గా మాయ చేస్తుంది ఈభామ‌. బాలీవుడ్ లో ఇప్ప‌టికే నిధి అగ‌ర్వాల్ గుర్తింపు తెచ్చుకుంది. అక్క‌డ మున్నా మైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ కు జోడీగా న‌టించింది. అందులో అందాల‌న్నీ ఆర‌బోసింది నిధి. అస‌లు మొహ‌మాటం అనే ప‌దానికి అర్థం కూడా తెలియ‌దు ఈ భామ‌కి. అంత‌గా అందాల నిధి బ‌య‌ట పెడుతుంది.  ఇక ఇప్పుడు ఈ భామ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది. అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. ఇక్క‌డ నాగ‌చైత‌న్య హీరోగా చందూ మొండేటి తెర‌కెక్కిస్తోన్న స‌వ్య‌సాచిలో హీరో యిన్ గా న‌టిస్తుంది నిధి అగ‌ర్వాల్. వెంకీ అట్లూరితో అఖిల్ చేస్తోన్న సినిమాలోనూ హీరోయిన్ గా నిధినే తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రోజుకో విధంగా హాట్ హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియాకే సెగ‌లు  పుట్టిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా జిక్యూ బెస్ట్ డ్ర‌స్సెడ్ ప్రోగ్రామ్ లో అందాల‌న్నీ ఇలా ఆర‌బోసింది నిధి. న‌ల్ల‌డ్ర‌స్సులో నిధిని చూసి అంతా ఫిదా అయి పోయారు. ఎంతైనా బాలీవుడ్ బ్యూటీ క‌దా.. అక్క‌డ్నుంచి వ‌చ్చిన బుద్దులు ఎక్క‌డికి పోతాయి..? మ‌రి చూడాలిక‌.. ఈ అందాల నిధి తెలుగులో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో..!

More Related Stories