English   

భలే ఛాన్స్ కొట్టేసిన నిధి 

Nidhi Agarwal
2019-05-23 12:59:39

ఈ మధ్య కాలంలో తెలుగులో పరిచయమయిన అందమైన నాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. నాగ చైతన్య సరసన నటించిన సవ్యసాచి సినిమాతో ఆమె తెలుగు ఆరంగ్రేటం చేసింది, ఆ సినిమా హిట్ కకాపోయినా ఈ భామకి మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమా కూడా చేసింది ఈ భామ, ఆ సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ అయితే తెచ్చిపెట్టలేదు, ఆ సినిమా తర్వాత ఇక సినిమాలు దొరకవు అని అనుకుంటున్న తరుణంలో పూరీ రూపంలో ఆమెకు ఇస్మార్ట్ శంకర్ అవకాశం దక్కింది. ఇక ఈ సినిమా హిట్ అయితేనే ఈ భామకి ఆఫర్స్ అనుకుంటున్న తరుణంలో ఈ భామ తమిళ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళంలో జయం రవి హీరోగా 'బోగన్' ఫేమ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కి అవకాశం దక్కిందని అంటున్నారు. హోమ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమా గనుక హిట్ అయితే తమిళంలో అయినా ఈ భామ సెటిల్ అయ్యే అవకాశం ఉంది.

More Related Stories