English   

సైరాలో మెగా హీరోయిన్

sye raa
2018-07-27 10:11:09

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర్య(..?) సమరయోధుడుగా చెబుతోన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. అత్యంత పవర్ ఫుల్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ మూవీలో ఇప్పుడు నిహారిక కూడా జాయిన్ కాబోతోంది. అవును.. సైరా నిహారిక కూడా ఓ పాత్రలో నటించబోతుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మాత్రం కాదని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో నిహారిక ఎంట్రీ అఫీషియల్ గానే పూర్తయినట్టు సమాచారం. కాకపోతే తన పాత్ర కేమియోగా ఉంటుందనే టాక్ కూడా ఉంది. అంటే ఏదో ఒక చిన్న పాత్రలో తను కనిపిస్తుందన్నమాట. నిజానికి నిహారిక అంటే చిరంజీవికి కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టం కొద్దే.. తన సినిమాల్లోకి వస్తానంటే వద్దనలేదు మెగా ఫ్యామిలీ. మొత్తంగా ఇంట్లో చిన్న కూతురుగా నిహారికను ‘కేమియో’ లెవెల్లో కూడా బాగానే గారాబం చేస్తున్నట్టున్నారు. 

More Related Stories