English   

సైలెంట్ గా నిహారిక ఎంగేజ్మెంట్..ఆమె ప్రాబ్లం అంటూ నాగబాబు సెటైర్లు 

Niharika Konidela
2020-08-14 13:48:16

ముందు నుండీ ప్రచారం జరిగినట్టుగానే మెగా డాటర్‌ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం నిన్న రాత్రి సైలెంట్ గా జరిగిపోయింది. హైదరాబాద్‌ లోని చిరు ఇంట జరిగిన ఈ వేడుకలకు ఇరు కుటుంబాలతో పాటుగా అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక పవన్ ఫ్యామిలీ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేసింది. కాగా,ఈ ఏడాదిలోనే నిహారిక-చైతన్య పెళ్లి జరగనుందని అంటున్న్నారు. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్, ధరమ్ తేజ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నాగబాబు, వరుణ్ తేజ్ లు తమ కూతురి ఎంగేజ్మెంట్ సంధర్భంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం తెలియజేశాడు వరుణ్ తేజ్.  ఇక నాగాబు ఏమో డియర్ చై, ప్రతి ఒక్కరు తను చాలా విషయాల్లో నాలానే ఉంటుందని చెబుతుంటారు, నాకు నమ్మకం ఉంది తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపించగలవని. ఇక నేటి నుంచి ఆమె అధికారికంగా నీ ప్రాబ్లం అంటూ సరదాగా పేర్కొన్నారు.

More Related Stories