English   

పెళ్లికి ఆహ్వానిస్తోన్న నిహారిక, సుమంత్  

Niharika-Konidela
2018-06-21 20:48:35

కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలెంట్ చూపిస్తోంది. ఫస్ట్ మూవీకే బెస్ట్ ఇంప్రెషన్ వేసి ఈ మెగాగాళ్ మొన్నా మధ్య ఓ తమిళ కామెడీ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న సినిమాలోనూ తనే హీరోయిన్. ఈ సినిమా పేరు ‘హ్యాపీ వెడ్డింగ్’.హ్యాపీ వెడ్డింగ్ ను యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మధ్య సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ వీడియోస్ కు రకరకాల పేర్లు పెడుతున్నారు. అది కూడా సినిమా కాన్సెప్ట్ ను బట్టే ఇంపాక్ట్ వేస్తున్నారు. అందుకే ఈ హ్యాపీ వెడ్డింగ్ టీమ్ కూడా రేపు ఉదయం 9గంటలకు తమ సినిమా ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ను ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య అనే కొత్త దర్శకుడు డైరెక్టర్. మొత్తంగా నిహారికతో పాటు సుమంత్ అశ్విన్ కు కూడా ఈ సినిమా చాలా కీలకం. ఒకవేళ మంచి హిట్ అయితే కనక ఖచ్చితంగా ఈ ఇద్దరికీ ఇది బ్రేక్ ఇచ్చిన సినిమాగా నిలుస్తుంది. 

More Related Stories