English   

హ్యాపీవెడ్డింగ్ యుఎస్ టాక్ ఏంటి..?

Niharika Konidela Happy Wedding Overseas Talk
2018-07-28 09:21:26

కొణిదెల నిహారిక న‌టించిన రెండో సినిమా హ్యాపీవెడ్డింగ్ విడుద‌లైంది. రెండేళ్లుగా ఏ సినిమా చేయ‌ని ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు పెళ్లి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలి సినిమా పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ మాదిరి చేసిన ఈ మెగా వార‌మ్మాయి.. ఇప్పుడు మాత్రం కాస్త క‌మ‌ర్షియ‌ల్ సినిమాతోనే వ‌చ్చింది. కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 28న విడుద‌లైంది. యుఎస్ లో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ ప‌డిపోయాయి. అక్క‌డ్నుంచి వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం ఒక మ‌న‌సు కంటే చాలా బెట‌ర్ సినిమాతోనే ఈ సారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది నిహారిక‌. ముఖ్యంగా న‌ట‌న విష‌యంలోనూ చాలా మెరుగైంద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు.

అన్నింటికంటే మించి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డం హ్యాపీవెడ్డింగ్ కు క‌లిసొచ్చే అంశం. అబ్బాయి అమ్మాయి మ‌ధ్య‌లో ఉండే సున్నిత‌మైన భావోద్వేగాలే ఈ చిత్ర క‌థ‌. యువీ క్రియేష‌న్స్ కావ‌డంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. క‌థ బాగుంది.. కామెడీ బాగుంది కానీ చెప్పిన విధానం మాత్రం చాలా స్లోగా ఉంద‌ని తెలుస్తుంది. ఇదే సినిమాకు మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు ఓవర్సీస్ ఆడియ‌న్స్. మ‌రి ఈ టాక్ తో సినిమా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

More Related Stories