English   

చీర కట్టడం నేర్చుకుంటున్న నిహారిక కొణిదెల..

Niharika Konidela
2020-07-08 11:09:57

కొణిదెల వారమ్మాయి నిహారిక పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. దానికి కారణం పెళ్లి కుదరడమే. మెగా కుటుంబానికి బాగా తెలిసిన ఓ అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుంది నిహారిక. ఆగస్ట్ లోనే నిశ్చితార్థం.. డిసెంబరులో పెళ్లి చేయాలని చూస్తున్నారు మెగా ఫ్యామిలీ. ఇప్పటికే ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు కూడా బాగానే వస్తున్నాయి. తనకు కాబోయే వాడానికి స్వయంగా నిహారికనే పరిచయం చేసింది కూడా. ఆయన్ని గట్టిగా హత్తుకుని అందరికీ పరిచయం చేసింది మెగా అమ్మాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది నిహారిక. 

ఈ క్రమంలోనే తనకు నచ్చిన పోస్టులు పెడుతూ ఉంటుంది. తన గురించి కూడా అభిమానులకు చెప్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతుంది ఈ బ్యూటీ. చీర కట్టుకోవడం కూడా నేర్చుకుంటుంది నిహారిక. ప్రస్తుతం తన తల్లితో చీర కట్టించుకున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది నిహారిక. ఆ ఫొటోల్లో పదహారణాల అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది నిహారిక కొణిదెల. చైతన్య జొన్నలగడ్డతో త్వరలోనే ఈమె ఏడడుగులు వేయబోతుంది. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే నిహారిక పెళ్లి జరగనుంది. 

More Related Stories