English   

హ్యాపీ వెడ్డింగ్ తోనైనా హ్యాపీ ఎండింగ్ వస్తుందా..?

Niharika Sumanth Ashwin Happy Wedding
2018-07-24 18:10:24

హ్యాపీ వెడ్డింగ్... కొణిదెల వారమ్మాయి నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా రూపొందిన సినిమా. ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాపై ఈ ఇద్దరూ చాలా ఆశలే పెట్టుకున్నారు. నిహారిక ఈ మూవీతో ఫస్ట్ హిట్ కొట్టాలని.. సుమంత్ అశ్విన్ ఉనికిని నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే రిలీజ్ కు ముందే తెలుగు రాష్ట్రాల్లో టూరింగ్ లు వేస్తూ.. ప్రమోషనింగ్ లు సేత్తన్నారు. ఈ ప్రమోషన్స్ ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతాయని వేరే చెప్పక్కర్లేదు. నిజానికి ఇద్దరికీ ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ లేదు. అందువల్ల ఇలా ప్రీ రిలీజ్ టూర్స్ వేస్తే పోస్ట్ రిలీజ్ యూజ్ ఫుల్ అవుతుంది.

లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. సినిమాలో వీరితో ఇంకా కీలకమైన పాత్రలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే అందరికంటే ఈ హ్యాపీ వెడ్డింగ్ మెయిన్ లీడ్ కే ఇంపార్టెంట్. ఆ ఇద్దరికే ఈ సినిమా కీలకం. అవును.. హ్యాపీ వెడ్డింగ్ హిట్ అయితేనే నిహారికకు మరో ఆఫర్ వస్తుంది. లేదంటే యూ ట్యూబ్ న్యూస్ (పెళ్లిపై)ను నిజం చేస్తారు ఫ్యామిలీవాళ్లు అంటున్నారు.

ఇటు సుమంత్ అశ్విన్ కు ఇంత పెద్ద బ్యానర్ లో ఆఫర్ రావడమే ఎక్కువ. ఒకవేళ ఇదీ పోయిందంటే ఇక కుర్రాడు ఇంటికే పరిమితం కావడం ఖాయం. అందుకే హ్యాపీ వెడ్డింగ్ మంచి హిట్ అయితేనే ఈ ఇద్దరి కెరీర్ లో మైనస్ లకు ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ వేస్తుంది.. లేదంటే కష్టాలు తప్పవు.

More Related Stories