English   

నిహారిక పెళ్లికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయ్..!!

Happy wedding  - 01
2018-06-30 20:16:37

నిహారికి పెళ్లికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు ముందు పెళ్లైతే కుదిరింది కానీ.. అది జరగడానికే చాలా అడ్డంకులు ఉన్నట్టు అనిపిస్తోంది. నిహారిక ఏంటీ పెళ్లేంటీ అనుకుంటున్నారా..? అదేనండీ ఆ మెగా అమ్మాయి లేటెస్ట్ సినిమా ఉంది కదా.. హ్యాపీ వెడ్డింగ్. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ చూస్తే ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయన్నమాట. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని లక్ష్మణ్ కార్య తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతోంది. ట్రైలర్ చూస్తే చాలా ఫ్రెష్ గా ఉన్నట్టే ఉంది. నిహారిక, సుమంత్ జంట కూడా బావుంది. పెళ్లి కుదిరిన తర్వాత వచ్చిన మనస్ఫర్థల ఆధారంగా ఈ కథ అల్లుకున్నట్టు అర్థమౌతోంది.

పెళ్లనగానే అమ్మాయిలు మానసికంగా సిద్ధమయ్యారా లేదా అనేది చూడకుండానే కొందరు అబ్బాయిలు చేసే అతి ప్రవర్తన వల్ల చాలా సంబంధాలు చెడిపోవడం చూశాం. అలాంటి నేపథ్యమే ఈ కథకున్నట్టుంది. బట్ సినిమా కాబట్టి ఆఖర్లో అంతా సవ్యంగానే అవుతుందని ఊహించేయొచ్చు. ఇక ట్రైలర్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. నరేష్ కు మరోసారి మంచి క్యారెక్టర్ దొరికినట్టుంది. ఆఖర్లో అతను చెప్పిన ‘వాళ్లెవరనుకున్నావ్ రా.. అమ్మాయిలు’ అనే డైలాగ్ బావుంది. సినిమాలో చాలా పాత్రలే ఉన్నట్టున్నాయి. అంటే పెళ్లి బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కదా.. అందుకే ఇన్ని పాత్రలుండి ఉంటాయి. మొత్తంగా హ్యాపీ వెడ్డింగ్ కు చాలా అడ్డంకులే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇవన్నీ క్లియర్ అయ్యి పెళ్లి సవ్యంగా జరిగితే అటు నిహారికకు ఇటు సుమంత్ అశ్విన్ కూ మంచి విజయం దక్కినట్టే అవుతుంది. 

More Related Stories