English   

కొణిదెల వార‌మ్మాయి కొత్త‌గా ఉందిగా.. 

Niharika
2018-04-24 09:58:34

నిహారిక కొణిదెల‌.. ఇండ‌స్ట్రీలో ఉన్న మ‌రో వార‌సురాలు. ఎప్పుడూ వార‌సులే రావాలా కాస్త కొత్త‌గా ఉంటుంది వార‌సురాళ్లు కూడా వ‌స్తే అని భావించి అడుగు ముందుకేసిన ముద్దుగుమ్మ‌. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వార‌సులంతా స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు త‌ను కూడా ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుంది ఈ విష‌యాన్ని. అందుకే హీరోయిన్ గా ఎలాగైనా నిల‌బ‌డాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అస‌లు గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత మేకోవ‌ర్ అయిపోయింది ఈ భామ‌. ఇప్పుడు కానీ నిహారిక‌ను చూస్తే అంద‌రికీ షాక్ త‌ప్ప‌దు. అంత‌గా మారిపోయింది. నిజంగా మ‌నం చూస్తున్న‌ది ఒక‌ప్పుడు చూసిన నిహారికానేనా అనే అనుమానం రాక మాన‌దు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయేలా మారిపోయింది ఈ భామ‌. ఇప్ప‌టి వ‌ర‌కు నిహారిక న‌ట‌న‌ను తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వాడుకోలేద‌నే చెప్పాలి. 

ఈ భామ ప్ర‌స్తుతం హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది. స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు రెస్పాన్స్ బాగానే వ‌చ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఈమె కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ తో త‌ను కూడా తొలి విజ‌యం అందుకుంటాన‌ని ఆశిస్తుంది నిహారిక‌. ఈ మ‌ధ్యే త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఈమె న‌టించిన తొలి సినిమా విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో న‌టించింది. కానీ ఇది ఫ్లాప్. దాంతో కెరీర్ లో తొలి విజ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది నిహారిక‌. అంత‌లోనే ఇలాంటి మేకోవ‌ర్ తో పిచ్చెక్కించింది కొణిదెల పిల్ల‌. మ‌రి చూడాలిక‌.. ఈ అందం చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒకరు నిహారిక‌ను స్టార్ హీరోయిన్ చేయ‌క‌పోతారా..?

More Related Stories