English   

షూటింగ్ లో ప్ర‌మాదం..హీరో నిఖిల్ కు గాయాలు

 Nikhil
2021-03-11 10:53:31

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ‌-2 లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గుజ‌రాత్ లో జ‌రుగుతోంది. అయితే తాజాగా నిఖిల్ కు గాయాలైన‌ట్టు తెలుస్తోంది.  ఒక మెయిన్ యాక్షన్ సీన్ చిత్రికరిస్తున్న సమయం లో నిఖిల్ కు యాక్సిడెంట్ జరగినట్టు స‌మాచారం. దాంతో నిఖిల్ కాలు కి గాయం అయ్యింది. గాయాల పాల‌వ్వ‌డంతో యాక్ష‌న్ స‌న్నివేశేన్ని అక్కడికే నిలిపివేశారు. అంతే కాకుండా మ‌రికోన్ని రోజుల వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. చిన్న గాయం మిన‌హా ప్రస్తుతం నిఖిల్‌ ఆరోగ్యం బాగానే ఉంది. ఇదిలా ఉండ‌గా కార్తికేయ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చందు మొండేటీ ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కార్తికేయ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కి ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో క‌ల‌ర్ స్వాతి హీరోయిన్ గా న‌టించింది. ఇక ఎన్నో రోజులుగా హిట్ లు లేక స‌త‌మ‌త‌మైన నిఖిల్ కు కార్తికేయ‌, స్వామి రారా సినిమాల‌తో మంచి హిట్స్ వ‌చ్చాయి. మ‌రి కార్తికేయ 2 నిఖిల్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. 

More Related Stories