English   

నిఖిల్ ముద్ర భలే ఉందే

nikhil mudra first look poster
2018-06-01 21:57:32

యంగ్ స్టార్ నిఖిల్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేశాడు. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నట్టుగానేఈ మూవీకి ‘ముద్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళంలో అధర్వ మురళి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘కణితన్’కు రీమేక్ ఇది. ముద్రలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర చేయడం నిఖిల్ కు ఇదే ఫస్ట్ టైమ్. నిఖిల్ లాస్ట్ మూవీ కిరాక్ పార్టీ కూడా కన్నడ సినిమా రీమేక్. అది ఆడలేదు. అయినా ఇప్పుడు మరో తమిళ సినిమా రీమేక్ తో రాబోతున్నాడు. నిజానికి ఇది నిఖిల్ వంటి యంగ్ స్టర్ కు ఖచ్చితంగా సరిపోయే కథే. అందుకే నిఖిల్ ఈ సినిమాను ఎంచుకుని ఉంటాడనుకోవచ్చు. 

ఇక మొదట్లో ఈ సినిమా హీరోయిన్ గా అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఫోటోషూట్స్ చేసిన తర్వాత నిఖిల్ తోఅమ్మడి జత సరిగ్గా కుదర్లేదు. దీంతో షాలినిని తప్పించి లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. ప్రస్తుతం ఆఫర్స్ లేక ఇబ్బంది పడుతోన్న లావణ్యకు ఇది అనుకోని అవకాశంగా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. టిఎన్ సంతోష్ డైరెక్ట్ చేస్తోన్న ముద్రకు ఠాగూర్ మధు సమర్పకుడిగా ఉన్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మాతలు. మొత్తానికి వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతోన్న నిఖిల్ కు ఈ ముద్ర కెరీర్ పరంగా బలమైన ముద్ర వేస్తోందనే నమ్మకంతో ఉన్నాడు. 

More Related Stories