English   

నవంబర్ లో నిఖిల్ ముద్ర

Nikhil-Mudra-release
2018-08-10 18:26:27

వైవిధ్యమైన సినిమాలతో వరుస విజయాలు సాధిస్తోన్న హీరో నిఖిల్. కొన్నాళ్లుగా అన్నీ డిఫరెంట్ సినిమాలే చేస్తోన్న నిఖిల్ రీసెంట్ మూవీ కిరాక్ పార్టీ డిజాస్టర్ అయింది. అయినా అతనికి క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం అతను ఓ తమిళ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. కణితన్ పేరుతో వచ్చిన అధర్వ మురళి హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హీరో జర్నలిస్ట్. సో.. ఇప్పుడు నిఖిల్ కూడా కెరీర్ లో ఫస్ట్ టైమ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఇక తెలుగులో ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ఎప్పుడో కన్ఫార్మ్ చేశారు. టిఎన్ సంతోష్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 8న ముద్ర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ కరెంట్ ఇష్యూను కమర్షియల్ గా డీల్ చేసిన ఈ కథ థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది. ఇక కేశవ తర్వాత ఆ తరహాలో కాస్త సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు నిఖిల్. మొత్తంగా దసరా హడావిడీ తగ్గిన తర్వాత నిఖిల్ తనదైన ముద్ర తో ప్రేక్షకుల ముందుకు వస్తాడన్నమాట. 

More Related Stories