English   

నిఖిల్ ఏంటి సైకిల్ చైన్ ప‌ట్టుకున్నాడు..

Kirrak Party nikhil
2018-03-07 16:21:17

సైకిల్ చైన్ అంటే కేరాఫ్ అడ్ర‌స్ నాగార్జునే. శివ సినిమాలో ఈయ‌న ప‌ట్టుకున్న చైన్ ఇప్ప‌టికీ ఫేమ‌స్సే. సినిమా వ‌చ్చి 29 ఏళ్లు పూర్తైనా కూడా ఇప్ప‌టికీ సైకిల్ చైన్ ప‌ట్టుకున్నా.. కాలేజ్ గొడ‌వ‌లు చేసినా కూడా శివ సినిమానే గుర్తుకొస్తుంది. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు మ‌రోసారి సైకిల్ చైన్ ప‌ట్టుకున్నాడు ఓ హీరో. అత‌డే నిఖిల్. ఈయ‌న న‌టిస్తున్న కిరాక్ పార్టీ మార్చ్ 16న విడుద‌ల కానుంది. తాజాగా విడుద‌లైన ఓ పాట‌లో సైకిల్ చైన్ ప‌ట్టుకుని ర‌చ్చ చేస్తున్నాడు ఈ హీరో. కాలేజ్ క‌థ‌లంటే తెలుగు ఇండ‌స్ట్రీలో ముందుగా గుర్తొచ్చేది శివ‌.. ఆ త‌ర్వాత హ్యాపీడేస్. ప‌దేళ్ల క్లాస్ అయితే హ్యాపీడేస్ అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు కిరాక్ పార్టీ ప‌క్కా మాస్. ఈ చిత్ర ట్రైల‌ర్ కూడా శివ, హ్యాపీడేస్ సినిమాల‌కు స్పూఫ్ లా అనిపిస్తుంది. కాలేజ్ గొడ‌వ‌లు.. ప్రేమ‌లు.. స్నేహాలు అన్నీ ఇవే క‌నిపిస్తున్నాయి. దానికితోడు స‌డ‌న్ గా గ‌డ్డం పెంచేసుకుని నిఖిల్ కొత్త‌గా క‌నిపించాడు. ఇది ప్రేమ‌మ్ ను గుర్తు చేస్తుంది.

క‌న్న‌డనాట గ‌తేడాది సంచ‌ల‌నం సృష్టించిన కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ ఇది. అక్క‌డ ఏడాది ఆడేసింది ఈ చిత్రం. ఇందులో ఏం ఉందో తెలియ‌దు కానీ ఇప్పుడు ఈ పేరు మాత్రం సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది. క‌థ న‌చ్చి.. ఆ కిక్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఇవ్వాల‌ని వ‌చ్చేస్తున్నాడు నిఖిల్. ఇక్క‌డ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేస్తున్నాడు కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. ఈ చిత్రానికి డైలాగులు చందూ మొండేటి రాయ‌గా.. స్క్రీన్ ప్లే బాధ్య‌త‌ను సుధీర్ వ‌ర్మ తీసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల నుంచి ఔట్ పుట్ తీసుకుని కిరాక్ పార్టీ తెర‌కెక్కించాడు శ‌ర‌ణ్. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా ఇప్పుడు నిఖిల్ కూడా సూప‌ర్ ఫామ్ లో ఉండ‌టంతో సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌నిపిస్తుంది. మార్చ్ 16న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. కిరాక్ పార్టీతో నిఖిల్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో..?

More Related Stories