English   

హీరోయిన్ పై నిఖిల్ ముద్ర

Nikhil-mudra

నిఖిల్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే చాలామంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. కారణం అతను ఎంచుకుంటోన్న సబ్జెక్టులే. ఒకప్పుడు ఆవారా కథలతో లాస్ అయిన నితిన్ ఆ తర్వాత రూట్ మార్చాడు. రూట్ తో పాటు ఫేమ్ మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కిరాక్ పార్టీ అనే సినిమా చేశాడు. ఈ నెల 16న విడుదల కాబోతోందీ పార్టీ మూవీ. 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. రేపటి నుంచి నిఖిల్ కిరాక్ పార్టీ ప్రమోషన్స్ కోసం వివిధ నగరాలు పర్యటించబోతున్నాడు. అయితే కిరాక్ పార్టీ తర్వాత నిఖిల్ మరో కొత్త ముద్ర వేయబోతున్నాడు. 

కిరాక్ పార్టీ కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీకి రీమేక్. ఇప్పుడు ఓ తమిళ రీమేక్ తో రాబోతున్నాడు. అధర్వ మురళి హీరోగా వచ్చిన ఆ సినిమా కణితన్. దీన్నే తెలుగులో ‘ముద్ర’పేరుతో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్. ఈ మూవీ కూడా థ్రిల్లర్ తరహాలో సాగుతుంది. వైవిధ్యమైన కథ, కథనాలతో సాగుతుంది. ఈ మూవీలో హీరోయిన్ విషయంలోనూ తన ముద్ర చూపించాడు నిఖిల్. అర్జున్ రెడ్డితో యూత్ కు హాట్ ఫేవరెట్ అయిన శాలిని పాండేను సెలెక్ట్ చేసుకున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో నిఖిల్ పేరు కూడా అర్జున్. అర్జున్ సురవం అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు నిఖిల్. మొత్తంగా తనకంటూ ఓ ఇమేజ్ ను ఫామ్ చేసుకుని అందుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ వెళుతోన్న నిఖిల్ ఈ మూవీ తర్వాత కూడా మరో సూపర్ హిట్ మూవీ చేయబోతున్నాడు. స్టార్ట్ కాకుండానే సూపర్ హిట్ అని ఎలా అంటారు అనుకోవచ్చు. అనొచ్చు. ఎందుకంటే ఇది సీక్వెల్.

నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ చందు మొండేటి డెబ్యూ మూవీ కార్తికేయ. యానిమల్ హిప్నాటిజం అనే కొత్త కాన్సెప్ట్ ను ఇంటర్ డ్యూస్ చేశారీ మూవీతో. ఈ మూవీకే సీక్వెల్ చేయబోతున్నారు. ప్రస్తుతం చందు సవ్యసాచితో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ అయిపోగానే కార్తికేయ సీక్వెల్ పై దృష్టిపెడతాడు. ఈ గ్యాప్ లో నితిన్ ముద్రను పూర్తి చేస్తాడు. అలా ఆ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోందన్నమాట.

More Related Stories