English   

హాయ్ బ్యూటీకి పాప పుట్టిందోచ్..

Nikita thukral
2018-03-03 11:44:30

తెలుగు ఇండ‌స్ట్రీ మ‌హాస‌ముద్రం. ఎంతోమంది హీరోయిన్లు వ‌స్తుంటారు.. పోతుంటారు. ఎంత‌మందిన‌ని గుర్తు పెట్టుకుంటాం చెప్పండి. అందులో ఓ ముద్దుగుమ్మ నిఖిత‌. అప్పుడెప్పుడో 2003 లో ఆర్యన్ రాజేష్ హీరోగా ప‌రిచ‌య‌మైన హాయ్ సినిమాతోనే ఈమె కూడా ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. ఈ చిత్రం ఫ్లాప్ అవ్వ‌డంతో నిఖిత‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఒక‌ట్రెండు ఆఫ‌ర్ల‌తోనే న‌డిపించింది కెరీర్. తెలుగులో దాదాపు 10 సినిమాల‌కు పైగానే చేసినా కూడా ఈమెకు క్రేజ్ రాలేదు. దాంతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయింది ఈ పంజాబి బ్యూటీ. అక్క‌డ మాత్రం విజయాలతో దూసుకుపోయింది. ఓ ద‌శ‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్ తో ఈమెకు అక్ర‌మ సంబంధం ఉందంటూ పెద్ద ర‌చ్చే జ‌రిగింది. దాంతో అత‌డి భార్య చేసిన ర‌చ్చ‌కు నిఖిత‌ను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ బ‌హిష్క‌రించింది. ఆ మ‌ధ్య ఓ పంజాబీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది నిఖిత‌. త‌మ ప్రేమ‌కు గుర్తుగా ఇప్పుడు ఓ పాప‌ను కూడా ఈ ప్ర‌పంచంలోకి తీసుకొచ్చింది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఇప్ప‌టికీ స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ‌. పాప పుట్టిన త‌ర్వాత కూడా ప్ర‌త్యేక గీతాల్లో చిందేస్తుంది హాయ్ బ్యూటీ.

More Related Stories