English   

నిను వీడని నీడను నేనే మూవీ రివ్యూ

Ninu Veedani Needanu Nene
2019-07-12 13:33:01

వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత సరయిన సినిమా చేయని సందీప్ కిషన్, మొట్టమొదటిసారిగా తను విన్న కధ మీద నమ్మకంతో నిర్మాతగా కూడా మారి ఒక సినిమా నిర్మించాడు. అదే నిను వీడని నీడను నేనే సినిమా. ఆయన సినిమాలు ఎన్నో వచ్చి వెళ్ళిపోయినా తెలియలేదు కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం, ఆయన చాలా కష్టపడ్డాడు, ప్రభాస్ కి ఫస్ట్ టికెట్ ఇచ్చి క్రేజ్ తెద్దామని చూశాడు, మరి ఇన్ని ప్రయత్నాలు చేశాక రిలీజ్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

క‌థ :

క‌థ 2035లో మొద‌ల‌వుతుంది. డాక్టర్ మురళీ శర్మ, తన దగ్గరకి వచ్చిన ఇరవై ఏళ్ల క్రితం కేసును చెప్పేప్పుడు సినిమా గతంలోకి వెళ్తుంది. ఆయన చెప్పిన కేస్ ప్రకారం, సందీప్ కిష‌న్, అన్యా ప్రేమించి ఇంట్లో చెప్ప‌కుండా పెళ్లి చేసుకుంటారు. ఆ త‌ర్వాత వేరు కాపురం పెట్టుకుని హాయిగా ఉంటారు. అయితే ఓ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో యాక్సిడెంట్ అవుతుంది. ఆ పక్కనే స్మ‌శానం కూడా ఉంటుంది. యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత ఇంటికి వ‌చ్చి అద్దంలో చూసుకుంటే సందీప్ మొహంలో వెన్నెల కిషోర్ క‌నిపిస్తాడు. ఆయన భార్య అద్దంలో చూస్తే వేరే ఆమె కనిపిస్తుంది. ఇలా చాలా రోజులు కంటిన్యూ అవుతుంది. డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. సందీప్ బాడీలో వెన్నెల కిషోర్ ఆత్మ చేరిందని, ఇక అప్పటి నుండి మొదలవుతుంది అసలు కధ. అసలు ఈ వెన్నెల కిషోర్ ఎవరు ? ఎందుకు సందీప్ శరీరంలోకి చేరాడు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

విశ్లేషణ :

కొన్ని సినిమాలు తెలియ‌కుండా షాక్ ఇస్తుంటాయి. కొత్త పాయింట్ తీసుకుని దానికి త‌గ్గ స్క్రీన్ ప్లే రాసుకుని..ఎక్క‌డా ఆస‌క్తి త‌గ్గ‌కుండా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు కార్తిక్ రాజు. అద్దంలో ఒక‌రి మొహం మ‌రొక‌రిలా క‌నిపించ‌డం, ఆ త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాలు ఇవ‌న్నీ బాగానే అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ సెకండాఫ్ మాత్రం అనుకున్నంత ఆస‌క్తిక‌రంగా సాగ‌లేదు. ఫ‌స్టాఫ్‌కే క‌థ‌పై ఓ క్లారిటీ వ‌చ్చేయ‌డంతో అక్క‌డ కొత్త‌గా చూపించ‌డానికి ఏం లేకుండా పోయింది. దానికితోడు సీరియ‌స్‌గా సాగుతున్న క‌థ‌లో మ‌ధ్యలోకి కావాల‌ని కామెడీ ఇరికించే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు. అస‌లు అద్దంలో వేరేవాళ్ల మొహం ఎందుకు క‌నిపిస్తుంది.. ఎందుకు అలా జ‌రుగుతుంద‌నేది కొత్త పాయింట్. దాన్ని చాలా వ‌ర‌కు ఆస‌క్తిక‌రంగానే డీల్ చేసాడు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్ కూడా అదే స్థాయిలో ఉండుంటే సినిమా రేంజ్ మారిపోయే ఉండేది..సందీప్ కిష‌న్ చాలా రోజుల త‌ర్వాత ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఎంచుకున్నాడు. వెన్నెల కిషోర్ హీరోతో స‌మాన‌మైన పాత్ర‌లో మెప్పించాడు..మొత్తానికి కొత్త ఐడియా కోసం నినువీడ‌ని నీడ‌నునేనే చూడ‌దగ్గ సినిమానే.

ఫైనల్ గా : చాన్నాళ్ళగా హిట్ కోసం పరితపిస్తున్న సందీప్ కిషన్ కి ఊరటనిచ్చే సినిమా అని చెప్పొచ్చు. 

రేటింగ్ : 2.5 /5.

More Related Stories