English   

తాప్సి ఇంటిపై ఐటీ దాడులు...విమర్శలపై ఇలా స్పందించిన నిర్మలమ్మ

Nirmala Sitharaman
2021-03-06 13:13:46

ప్రముఖ నటి తాప్సి పన్ను, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగానే తాప్సి మరియు అనురాగ్ కశ్యప్ కు చెందిన ఆఫీసులు మరియు ఇళ్లపై కేంద్రం కుట్ర పూరితంగా దాడులు చేస్తుందని సోషల్ మీడియాలో ఆరోపణలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 

"గతంలో 2013 లో కూడా ఐటీ దాడులు జరిగాయని. కానీ అప్పుడు ఎవరూ ఇలా స్పందించలేదని అన్నారు. అయితే తన వ్యాఖ్యలతో నిర్మలా సీతారామన్ అనురాగ్ , తాప్సి పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. 2013 లో అదే వ్యక్తులపై దాడులు జరిగాయని నిర్మలా అన్నారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇది సమస్యగా కనిపిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ఫాంటమ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ, అనురాగ్ కశ్యప్, తాప్సి, వికాష్, మధు మంతెన కు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లో 28 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. కాగా ఫాంటమ్ ఫిల్మ్స్ కు సంబందించిన ఆఫీసుల్లో కోట్లకుపైగా అవినీతి జరిగినట్టు డాక్యుమెంట్స్ దొరికినట్టు గుర్తించారు.

More Related Stories