English   

ఆ హీరోలకు నెక్ట్స్ ‘వీక్ టెన్షన్’

Nithiin-Chal-mohan-ranga

రంగస్థలం.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. ఇండస్ట్రీలోనే కాదు.. కామన్ ఆడియన్స్ లోనూ అదిరిపోయే క్రేజ్ వచ్చిందీ సినిమాకు. దీంతో ఇప్పట్లో ఈ క్రజ్ తగ్గడం కష్టం అనుకోవచ్చు. ఇది వీరికి బానే ఉన్నా.. నెక్ట్స్ వీక్ వచ్చే సినిమాలకు సంబంధించి అప్పుడే టెన్షన్ పట్టుకుంది. నెక్ట్స్ వీక్ నితిన్ ఛల్ మోహన్ రంగాతో పాటు మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర ఉన్నాయి. మామూలుగానే ఈ రెండు సినిమాలకూ ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. 

ముఖ్యంగా నితిన్ సినిమాకు బ్యాకప్ భారీగా ఉన్నా.. ఆ రేంజ్ క్రేజ్ మాత్రం రాలేదనేది వాస్తవం. త్రివిక్రమ్ కథ, పవన్ కళ్యాణ్ నిర్మాణ భాగస్వామి వంటి మాటలేవీ ఈ మూవీపై ఇంట్రెస్ట్ పెంచలేదనేది నిజం. అటు ట్రైలర్ కూడా మరీ ఫ్లాట్ గా ఉండటం మరింత మైనస్ అయ్యేలా ఉంది. పోనీ వీళ్లేమైనా ప్రమోషన్స్ తో కొంత హైప్ పెంచే ప్రయత్నమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇక ఇప్పుడు రంగస్థలం హిట్ కావడం, తమ మధ్య వారమే గ్యాప్ ఉండటంతో ఛల్ మోహన్ రంగా టీమ్ ను ఆందోళన మొదలైంది. 

ఇక ఇటు ఆచారి అమెరికా యాత్రపై ఆ మూవీ టీమ్ కే పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. సో.. వాళ్లు గాభరా పడ్డా వచ్చే రిజల్ట్ రాకమానదు అనుకోవచ్చు. సో.. నెక్ట్స్ వీక్ ఈ హీరోలిద్దరికీ ఇప్పుడే రంగస్థలం టెన్షన్ పట్టుకుందని చెప్పొచ్చు.. అయితే కొంతలో కొంత నితిన్ కు టైమ్ ఉంది. ఇప్పటికైనా ప్రమోషన్స్ విషయంలో స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకుని చొరవ చూపితే ఓపెనింగ్స్ అయినా బాగా వస్తాయి. అసలే ఇప్పటికే రెండు సినిమాలు వరుసగా పోగొట్టుకుని ఉన్నాడు. మళ్లీ ఇప్పుడీ సినిమా రిజల్ట్ కూడా తేడా కొడితే నితిన్ కు కొత్త ప్రాబ్లమ్స్ తప్పవు. 

More Related Stories