ఆసక్తికరంగా నితిన్ చెక్ ట్రైలర్

2021-02-03 19:06:04
చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం చెక్. రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తుంటే జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. 'యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ ఖర్మను తప్పించుకోలేరు' అంటూ వచ్చే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు అర్థం అవుతోంది. ఇందులో నితిన్ తరపున వాదించే లాయర్ గా రకుల్ కనిపిస్తోంది. కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటించారు. ఈ నెల 19న చిత్రం విడుదల కానుంది.