English   

నితిన్ సినిమాలో నయనతార.. అమ్మో ఆ పాత్ర చేస్తుందా..

Nayanthara
2020-08-08 13:02:18

నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం కూడా అందుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. షూటింగ్స్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. అందుకే ఫ్యూచర్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న రంగ్ దే.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట.. మేర్లపాక గాంధీతో అంధధూన్ రీమేక్.. ఇలా వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్. ఇందులో మేర్లపాక గాంధీ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మరో కీలక పాత్ర కూడా ఉంది. 

హిందీలో టబు చేసిన ఈ పాత్ర కోసం తెలుగులోనూ ఆమెనే అడిగారు నిర్మాతలు. చాలా బోల్డ్ గా ఉండే ఈ పాత్ర తెలుగులో చేయడానికి ఒప్పుకోలేదు టబు. దాంతో యాంకర్ అనసూయను ఈ పాత్ర కోసం అడిగారు. కానీ ఆమె కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లను కూడా ఈ క్యారెక్టర్ కోసం అడగగా వాళ్లు అదే సమాధానం చెప్పారు. చివరికి ఇప్పుడు నయనతారను ఈ పాత్ర కోసం ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ పారితోషికం ఇస్తే హీరో ఎవరు అని చూడకుండా సినిమా చేస్తుంది నయనతార. తమిళనాట అలా చిన్న హీరోలతో చాలా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకంటే వయసులో చిన్న వాడు కాదు ఇమేజ్ లో చిన్న వాళ్లతో కూడా నటించింది నయన్. మరి నితిన్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories