English   

రంగ్ దే నుండి మరో సాంగ్..సింపుల్ గుండే లైఫ్..టెంపుల్ రన్ గా మారే

 Nithiin Rang de
2021-02-27 12:43:21

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తోంది. సినిమాను 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక  ఇటీవల 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదలయిన తొలి గీతానికి  కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంలోని మరో సాంగ్ ను వీడియో రూపంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. "సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే" అనే లిరిక్స్ తో ఈ సాంగ్ కొనసాగుతుంది. 

ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు సాగర్ పాడిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. 'రంగ్ దే' చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నితిన్ నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించగా...సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించారు. 
 

More Related Stories