English   

నితిన్ కు మళ్లీ నిరాశేనా..?

Nithiin-flop
2018-08-10 15:01:57

నితిన్.. ఎగిసిపడ్డ కెరటం.. కెరీర్ ను గ్రాండ్ గా ఆరంభించిన నితిన్.. ఆ జోరును కంటిన్యూ చేయడంలో యేళ్లపాటు విఫలమయ్యాడు. ఆ టైమ్ లో మరే యంగ్ స్టార్ కు లేని స్థాయిలో వరుసగా పన్నెండు ఫ్లాపులు చూశాడు. అయినా నిరాశ చెందక ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఫైనల్ గా ఇష్క్ తో ఫామ్ లోకి వచ్చాడు. అప్పటి వరకూ యాక్షన్ హీరోగా రాణించాలనుకున్నవాడు కాస్తా ఇష్క్ తర్వాత ప్రేమకథలకు మళ్లాడు. అప్పటి నుంచి లక్ మళ్లీ తిరిగింది. వరుసగా మూణ్నాలుగు హిట్లు పడ్డాయి. ఇక నితిన్ మళ్లీ ఎగసిపోతున్నాడు అనుకున్నారు. ఈ టైమ్ లోనే మనోడ్ని తెలంగాణ పవర్ స్టార్ అన్నారు.

త్రివిక్రమ్ తో చేసిన అ.. ఆ.. అతని కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లింది. కానీ లెవెల్ ను మెయిన్టేన్ చేయడంలో నితిన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.. లేదంటే మరోసారి స్టోరీ సెలెక్షన్ లో తన వీక్ నెస్ చూపిస్తున్నాడనుకోవచ్చు. నిజానికి అ ఆ ఓవర్శీస్ లో హయ్యొస్టె గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎంత త్రివిక్రమ్ సినిమా అయినా నితిన్ స్టామినా కూడా ఆ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్పెట్ అయింది. కానీ అంతకు ముందు చేసిన చిన్నదాన నీకోసం పోయింది. కొరియర్ బాయ్ కళ్యాణ్ కొత్తగా ఉన్నా ఆకట్టుకోలేదు. తర్వాత చేసిన  లై, ఛల్ మోహన రంగా డిజాస్టర్స్ గా నిలిచాయి. అ ఆ మినహాయిస్తే నితిన్ కంటిన్యూస్ గా నాలుగు ఫ్లాపులు చూశాడు. వైవిధ్యమైన దర్శకులను ఎంచుకుంటున్నా.. రిజల్ట్ మారడం లేదు. 

దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ నితిన్ పదిహేనేళ్ల తర్వాత దిల్ రాజు తలుపు తట్టాడు. అతను కూడా ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. తన బ్యానర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని శతమానం భవతితో నేషనల్ అవార్డ్ అందించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమాకు సిద్ధమయ్యాడు. శ్రీనివాస కళ్యాణం అంటూ ముందు నుంచీ కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ సినిమా విడుదలైంది. కానీ రిజల్ట్ మారలేదు. శతమానం భవతిలోని మ్యాజిక్ మినిమం కూడా కనిపించకపోవడంతో ఈ కళ్యాణం ‘బలవంతపు పెళ్లి’గా మారిందంటున్నారు.  ఏ దశలోనూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయిందీ సినిమా. ఏ పాత్రా బలంగా లేదు. ఆత్మ లేని కథ, కథనాలతో ఫోర్స్ డ్ డైలాగ్స్ తో పాటు చాలా సన్నివేశాలు అత్యంత ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. దీంతో నితిన్ కు మరోసారి నిరాశ తప్పదు అంటోంది ట్రేడ్.. 

నితిన్ కు మొదటి నుంచీ ఉన్న సమస్య తనకు ఎలాంటి కథలు నప్పుతాయో తేల్చుకోలేకపోవడం. మధ్యలో కొన్ని కథల విషయంలో జడ్జిమెంట్ ఎవరిదో కానీ.. హిట్లు పడ్డాయి. కానీ ఇప్పుడా సిట్యుయేషన్ లేదు. మరోవైపు నుంచి తెలంగాణ ప్రాంతం వాడే అయిన విజయ్ దేవరకొండ మాసీగా దూసుకొస్తున్నాడు. ఇన్నాళ్లూ పెద్దగా పోటీ లేకున్నా.. ఇప్పుడతనికి విజయ్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మరింత ఒత్తిడి ఉంటుంది. అది జయించాల్సిన టైమ్ లో ఇలా సాధారణ కుటుంబ కథా చిత్రమ్ తో మరోసారి చేజేతులా తప్పు చేశాడా అంటోంది టాలీవుడ్. మొత్తంగా ఈ సినిమా రిజల్ట్ కమర్షియల్ గా ఎలా ఉన్నా.. ఖచ్చితంగా గొప్ప సినిమా అనలేం అనేది మెజార్టీ ఆడియన్ అభిప్రాయం.

More Related Stories