English   

శ్రీ‌నివాస క‌ళ్యాణం ఓవ‌ర్సీస్ టాక్..

Nithiin Srinivasa Kalyanam Overseas Premier Show Talk
2018-08-09 08:39:23

శ్రీ‌నివాస క‌ళ్యాణం షోలు ప‌డిపోయాయి. ఓవ‌ర్సీస్ నుంచి టాక్ కూడా వ‌చ్చేసింది. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమా త‌ర్వాత మ‌ళ్లీ స‌తీష్ వేగేశ్న ఇంక అంత‌కంటే ఇంకేం చేస్తాడు.. తీస్తాడు అనుకున్న వాళ్ల‌కు మ‌ళ్లీ మంచి సినిమాతోనే స‌మాధానం ఇస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా చాలా బాగా వ‌చ్చింద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. చాలా వ‌ర‌కు సీన్స్ అన్నీ క‌నెక్ట్ అయ్యే విధంగా ఉండ‌టం ఈ సినిమాకు ప్లస్. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో కారెక్ట‌ర్ ఇంట్రోల కోసం చాలా టైమ్ తీసుకున్నా.. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా జాగ్రత్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. ఇక ప్రకాశ్ రాజ్, నితిన్ మ‌ధ్య వ‌చ్చే ఇంట‌ర్వెల్ సీన్ కానీ.. సెకండాఫ్ లో ఏడు రోజుల పెళ్లి సీన్స్ అన్నీ చాలా బాగా క‌నెక్ట్ అవుతాయ‌ని చెబుతున్నారు యుఎస్ ప్రేక్ష‌కులు. రొటీన్ క‌థ కావ‌డం ఒక్క‌టే ఈ సినిమాకు మైన‌స్ కానీ మిగిలిన అన్ని విష‌యాల్లోనూ శ్రీ‌నివాస క‌ళ్యాణం వ‌ర్కవుట్ అయింద‌నే టాక్ వ‌చ్చింది. ఈ లెక్క‌న శ‌త‌మానం భ‌వ‌తి మాదిరే ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ కొట్టేయ‌డం ఖాయం.

More Related Stories