English   

శ్రీ‌నివాస క‌ళ్యాణం బిజినెస్ బెదుర్స్..!

Nithiin Srinivasa Kalyanam Pre Release Business
2018-08-08 06:49:20

అవును.. అదుర్స్ అయింది కాబ‌ట్టే ఇప్పుడు బెదుర్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు నితిన్ కెరీర్ లో క‌నీసం చూడ‌ని మొత్తాన్ని ఈ చిత్రం కోసం పెట్టిస్తున్నాడు దిల్ రాజు. త్రివిక్ర‌మ్ మాయ‌తో అప్ప‌ట్లో అ.. ఆ సినిమాను 35 కోట్ల‌కు అమ్మారు. ఇప్పుడు దిల్ రాజు పేరు చెప్పి శ‌త‌మానం భ‌వ‌తి ఉంద‌ని స‌తీష్ ఇమేజ్ చూపించి.. నితిన్ మార్కెట్ తో ప‌నిలేకుండా శ్రీ‌నివాస క‌ళ్యాణం బిజినెస్ జ‌రిగిపోయింది. ఈ చిత్రాన్ని ఏకంగా 27 కోట్ల‌కి అమ్మేసారు. నితిన్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 14 కోట్లు దాట‌డ‌మే క‌ష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో శ్రీ‌నివాస క‌ళ్యాణం 27 కోట్లంటే అరాచ‌క‌మే. కానీ దిల్ రాజు ఉన్నాడు క‌దా.. పైగా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం.. సినిమాపై ఉన్న పాజిటివ్ టాక్.. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ఈ పెళ్లికి భారీగా ప్రేక్ష‌కులు క‌లెక్ష‌న్లు చ‌దివిస్తార‌ని ఆశిస్తున్నారు బ‌య్య‌ర్లు.

గ‌తంలో ఎప్పుడూ నితిన్ సినిమాను కొన‌లేని రేట్ కు ఇప్పుడు దీన్ని కొనేసారు. పైగా వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులున్నా కూడా శ్రీ‌నివాస క‌ళ్యాణంతో తాను హిట్ కొడ‌తాన‌ని కాన్పిడెంట్ గా క‌నిపిస్తున్నాడు నితిన్. చిత్రయూనిట్ అంతా ఎక్క‌డలేని జోరు చూపిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం. యుఎస్ లో ముందురోజు రాత్రే 300 ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. ఈ సినిమాను అక్క‌డ 3 కోట్ల‌కు కొన్నారు. అ..ఆ కాకుండా నితిన్ కెరీర్ లో ఇదే హైయ్య‌స్ట్ రేట్. మొత్తానికి శ్రీ‌నివాస క‌ళ్యాణం బిజినెస్ చూస్తుంటే అదుర్స్ అనిపిస్తున్నా.. రాక‌పోతే మాత్రం బ‌య్య‌ర్ల‌కు బెదుర్స్ త‌ప్ప‌దు.

More Related Stories